తాజా మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంగు తిన్నారు. తొలుత ఆధిక్యంలో ఉన్న ఆయన రౌండ్లు సాగే కొద్ది వెనుకబడ్డారు. ఆఖరికి ఓటమి పాలయ్యారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. పాలేరు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. గెలిచి ఉంటే మరోసారి మంత్రి పదవి ఖాయం అని భావించారు. కానీ తుమ్మలను పాలేరు ప్రజలు తిరస్కరించి ఘోర ఓటమిని మూటకట్టి పంపించారు. తుమ్మలపై కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి కేవలం 1950 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు