ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరిగి ఉండొచ్చు…!

Were Doubting That Tampering Could Have Been Done In Evms

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కారు ఓవర్ స్పీడుతో దూసుకుపోతోంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ 90కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. మహాకూటమి 20కి కంటే తక్కువ స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. స్పష్టమైన ఆధిక్యంతో టీఆర్‌ఎస్ రెండోసారి అధికారం చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. గత నాలుగున్నరేళ్లలో తాము చేసిన సంక్షేమ పథకాల వల్లే తెలంగాణ ప్రజలు తమకు మళ్లీ పట్టం కట్టారని తెరాస నేతలు చెబుతున్నారు. అయితే ట్యాంపరింగ్ చోటుచేసుకుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కౌంటింగ్ పూర్తికాకముందే తాము గెలుస్తామని టీఆర్ఎస్ నేతలు ప్రకటించుకోవడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

Were-Doubting-That-Tamperin

కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతుందని టీఆర్ఎస్ నేతలు ముందుగానే చెప్పారనీ, ఈ వ్యవహారంలో తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. వీవీప్యాట్‌ల స్లిప్సులను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఈ రోజు మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలందరూ ఆర్వో అధికారులకు ఫిర్యాదు చేయాలని ఉత్తమ్ సూచించారు. తాను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఈ విషయమై ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ నేతలు ట్యాంపరింగ్ కు పాల్పడ్డారనీ, అందుకే ఫలితాల వెల్లడి ఆలస్యమయిందని పునరుద్ఘాటించారు.