కాలం మారుతూ ఉంది.. కాలంతో పాటు పరిస్థితులు, పనితీరు కూడా మారుతోంది. ప్రస్తుతం అంతా టెక్నాలజీదే రాజ్యం. ఇదంతా ఎందుకంటే.. గతంలో టీవీలో వార్తలు, వినోద కార్యక్రమాలు కేబుల్ కనెక్షన్ ఉంటే చానెళ్ల ప్రసారాలు చూసేవాళ్లం.. తదనంతరం టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ.. ఇంట్లో హోం థియేటర్ల డైరెక్ట్ టూ హోం (DTH) టెక్నాలజీ సాయంతో వచ్చేశాయ్.. ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండానే టీవీ చానళ్ల ప్రసారాలు వీక్షించే అవకాశం రాబోతుంది. ఎలాంటి డేటా కాస్ట్ లేకుండానే.. తక్కువ ఖర్చుతో.. ఒక్క మాటలో చెప్పాలంటే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఫ్రీగా కూడా వీక్షించవచ్చు. ఎలాగంటే.. డైరెక్ట్ 2 మొబైల్ (Direct to Mobile) టెక్నాలజీ DTH తరహాలోనే వచ్చేస్తోంది.
అసలేంటీ డైరెక్ట్ 2 మొబైల్ (Direct to Mobile) టెక్నాలజీ :
బ్రాడ్ బాండ్, బ్రాడ్ కాస్ట్ సమ్మేళనమే ఈ డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ.. మొబైల్స్‌లో ఎఫ్ఎం రేడియో ట్రాన్స్‌మిషన్ తరహాలోనే డీ2ఎం టెక్నాలజీ రూపుదిద్దుకుంటుంది. దీని ప్రకారం రేడియో తరంగాలను ఫోన్ రిసీవర్ స్వీకరిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ప్లాన్ ఇదీ..!
2026 నాటికి మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో అతిపెద్ద కంటెంట్ వేదికగా మొబైల్ ఫోన్లు నిలుస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మొబైల్ వినియోగదారులో లక్ష్యంగా కేంద్రం కసరత్తు షురూ చేసింది. మరోవైపు ఈ డైరెక్ట్ 2 మొబైల్ (Direct to Mobile) టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. టెలిఫోన్ ఆపరేటర్ల డేటా రెవెన్యూలో 80 శాతం పడిపోయే అవకాశాలున్నాయి.