టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ పోలీసులకు చిక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడున్నదీ బయటపడకుండా సిమ్ కార్డులు మారుస్తూ జాగ్రత్తపడుతున్నారు. అలాగే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఫోర్జరీ, డేటా చోరీ దొంగతనం వంటి అభియోగాల్లో రవిప్రకాష్ మీద మూడు కేసులు నమోదయ్యాయి. కనిపిస్తే అరెస్ట్ చేసే విధంగా ఆయనపై నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రవిప్రకాష్ తన లాయర్ ద్వారా పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇవ్వాలని, విచారణకు సహకరిస్తానని కోర్టును కోరడం జరిగింది. అంతేకాదు ఏబీసిపిఎల్ వాటల బదిలీ వివాదం ఎన్సిఎల్టీలో పెండింగ్ దశలో ఉందని, అది తేలకుండానే తనపై పోలీసులు కేసు నమోదు చేయడం చట్ట వ్యతిరేకమని వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ క్రమంలో మొన్న శివాజీ రిలీజ్ చేసినట్టే రవి ప్రకాష్ కూడా రిలీజ్ చేశారు. తన మీద వస్తున్న ఆరోపణలకు ఈ వీడియో సమాధానం అని చెప్పారు. తను టీవీ ఛానెల్ పెట్టలనుకున్నప్పుడు శ్రీని రాజు అండగా నిలిచారని, ఛానెల్ ఏర్పాటు చేశాక అన్ని ఛానెల్స్ నష్టంలో ఉన్నా సరే తమ చానెల్ లాభాల బాటలో పయనించిందని అయితే అయన తను లాభానికి అమ్ముతానంటే చాలా డీల్స్ చూశానని, మెగా కకృష్ణా రెడ్డి అనే ఆయన ఛానెల్ తన స్నేహితులతో కొనుక్కుంటానని చెప్పి రామేశ్వర్ రావుకి ఈ షేర్లు అమ్మారని చెప్పుకొచ్చారు. అయితే రామేశ్వర్ రావు, ఎంటర్ అయినప్పటి నుండి తనని ఇబ్బంది పెడతానని బెదిరించారని, ఈరోజు అదే చేస్తున్నారని అన్నారు. అలాగే తన మీద పెట్టిన మూడు కేసులు తప్పుడు కేసులు అని, వాటి మీద వివరణ ఇచ్చారు ఆయన. అలాగే పోలీసులు కూడా ప్రభుత్వం ఆదేశాలు కాకుండా రామేశ్వర్ రావు ఆదేశాలు పాటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ‘మాది కుటుంబ వ్యాపారం. నువ్వు మైనారిటీ షేర్ హోల్డర్ అయినా మేం ఎలాంటి ఒప్పందం చేసుకోం. నువ్వు మా దగ్గర ఓ జీతగాడిలా, పాలేరులా పనిచేయాల్సి ఉంటుంది. నువ్వు టీవీ9 వదిలి వెళ్లేలా నేను చూస్తాను. ఇందుకోసం ఎలాంటి ఇబ్బందులకైనా గురిచేస్తాను అని బెదిరించారని రవిప్రకాశ్ వీడియోలో తెలిపారు.