టీవీ షూటింగ్ లు షురూ… నిబంధనలివే..

ఇది బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు శుభ‌వార్త‌ అనే చెప్పాలి. అదేమంటే.. ఎంతోమంది మ‌హిళ‌లు అలరించే సీరియ‌ళ్లు, టీవీ షోలు త్వ‌ర‌లో త‌మ టెలివిజ‌న్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాయి. ఎంత‌గానో ఎదురుచూస్తున్న‌సీరియ‌ళ్ల‌ షూటింగ్‌లు పునఃప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అందుకోసం కొత్త నిబంధనలతో జూన్ చివ‌రి వారంలో ఈ ప్ర‌క్రియ మొద‌లు ‌కానున్నట్లు సమాచారం. ఈ విష‌యాన్ని ఫెడ‌రేష‌న్ ఆఫ్ వెస్ట్ర‌న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ అధ్య‌క్షుడు బిఎన్ ‌తివారీ జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో స్పష్టం చేశారు.

అదేవిధంగా లాక్‌డౌన్ కార‌ణంగా అన్ని ప్ర‌జా ర‌వాణా, స‌మావేశాలు, విద్యాసంస్థ‌లు మూత‌ప‌డిన విష‌యం తెలిసిందే. క‌రోనా కారణంగా సీరియ‌‌ళ్లు, టీవీ షో షూటింగ్ నిలిచి పోవ‌డంతో మ‌హిళ‌లు తీవ్ర ఆందోళ‌నకు గురౌతున్నారు. ఈ క్ర‌మంలో సీరియ‌ళ్లు మొద‌టి నుంచి ప్ర‌సారం చేసినప్ప‌టికీ ఆస‌క్తిగా వీక్షిస్తు‌న్నారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్‌ అనే చెప్పాలి. కాగా ఇక‌పై అనేక‌ కార్య‌క్ర‌మాలు త్వ‌రలో పరిమిత సిబ్బందితో ప్రారంభం కానున్నాయి. సీరియ‌ళ్ల‌లో ప‌నిచేసే వారిని దృష్టిలో ఉంచుకుని నిర్మాతలకు కొన్ని షరతులు పెట్టినట్లు తివారీ స్పష్టం చేశారు. షూటింగ్‌ తిరిగి ప్రారంభించడానికి టీవీ నిర్మాతలు వీటిని అంగీకరించాల్సి ఉంటుంది. అవేంటంటే

ముఖానికి మాస్కును ధరించడం, నిత్యం శానిటైజర్‌ను ఉప‌యోగించడం, ప్రతి సెట్లో ఒక ఇన్స్పెక్టర్ ని పెట్టుకోవడం వంటివి చేయాలి. అయితే నిబంధ‌న‌లను పాటించడం కోసం ఇన్స్పెక్టర్ అనేది ఇక నుంచి ప్రతి సెక్టార్ లో కామన్ గా మారే అవకాశాలు ఉన్నాయి.

అంతేకాకుండా కరోనా వైరస్ తో ఎవరైనా ఆర్టిస్ట్, కార్మికుడు మరణిస్తే సంబంధిత‌ ఛానెల్, నిర్మాత క‌లిసి చ‌నిపోయిన వారి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. వీటితోపాటు వారి వైద్య ఖర్చులను భ‌రించాలి. అలాగే ప్ర‌మాద‌వ‌శాత్తు షూటింగ్‌లో మరణించిన వారికి, నిర్మాతలు రూ. 40-42 లక్షలు ఇవ్వాలి. అయితే ఈ క‌నీస ప‌రిహార‌ మొత్తాన్ని ఎఫ్‌డ‌బ్ల్యూఐఎస్‌సీ రూ. 50 లక్షలకు పెంచింది. దీని ద్వారా కార్మికుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంద‌ని ఎఫ్‌డ‌బ్ల్యూఐఎస్ పేర్కొంది. వారికి ఏదైనా జరిగితే నిర్మాతలు వారి కుటుంబాన్ని చూసుకుంటారు అనే భరోసా ఉంటుంద‌. అలాగే సాధార‌ణంగా షూటింగ్ సమయంలో కనీసం 100 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ప‌నిచేస్తుంటారు.

కానీ ప్ర‌స్తుత ప‌రిస్థుల కార‌ణంగా ఈ సంఖ్య‌ను స‌గానికి అంటే 50శాతం సిబ్బంతితో నిర్వ‌హించాల్సి ఉంటుంది. అదేవిధఘంగా మిగ‌తావారు త‌మ ఉపాధిని కోల్పోకుండా ఉండేందుకు అంద‌రిని షిఫ్టుల వారిగా ప‌నికి అనుమ‌తించాల్సి ఉంటుంది. అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం కూడా ఉంది. అదేమంటే.. 50 ఏళ్లు పైబడిన వారు మాత్రం మ‌రో మూడు నెలలు ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇత‌రుల‌తో పోలిస్తే వీరికి క‌రోనా సోకే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఇంకా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ ఎల్లప్పుడూ సెట్స్‌లో అందుబాటులో ఉండాలి. ప్ర‌స్తుతానికి ఈ కొత్త మార్గదర్శకాలను ఎఫ్‌డ‌బ్ల్యూఐఎస్‌సీ రిలీజ్ చేసింది. అయితే ప‌రిస్థితిని బ‌ట్టి త్వ‌ర‌లో మ‌ళ్లీ నిబంధ‌న‌ల‌ను చేయ‌నున్న‌ట్లు స్పష్టం చేసింది. అందుకు సంబంధించి సీరియ‌ళ్ల నిర్మాతలు, ఛానల్ అధినేత‌ల‌తో ఎఫ్‌డ‌బ్ల్యూఐఎస్‌సీ త్వ‌ర‌లో వర్చువల్ సమావేశం నిర్వహించ‌నున్నట్లు పేర్కొంది.