వివాదంలో TVK పార్టీ చీఫ్ విజయ్‌…

TVK విజయ్
TVK విజయ్

తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. ఈ నేపథ్యంలో TVK స్థాపకుడు, నటుడు దళపతి విజయ్ పై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. మద్యం సేవించేవారిని, జూదగాళ్లను ఇఫ్తార్ విందుకు పిలిచి చట్టవిరుద్దంగా ప్రవర్తించారని..దీనితో పాటు రంజాన్‌ పవిత్రతను దెబ్బతీసేలా చేశారని ఫత్వాలో AIMJ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ పేర్కొన్నారు. ఇఫ్తార్ విందుకు జూదగాళ్లను ఆహ్వానించడంతో తమిళనాడులోని సున్నీ ముస్లింలు అతనిపై కోపంగా ఉన్నారని ఆయన తెలిపారు. వారి కోరిక మేరకే ఫత్వా జారీ చేశానని ఆయన అన్నారు.