ఇంటికి రా చంపేస్తా…స్టార్ హీరోకి భార్య వార్నింగ్ !

Twinkle Khanna Says She Will Akshay Kumar

తను నటించబోయే వెబ్ సిరీస్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసే నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఒంటికి నిప్పంటించుకుని మరీ స్టేజిపై నడచారు. దీనిపై తాజాగా ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్ ద్వారా స్పందించారు. బతికే ఉంటే ఇంటికి రా నిన్ను నేను చంపేస్తా అంటూ సరదాగా వార్నింగ్ కూడా ఇచ్చేశారు. అక్షయ్ ‘ది ఎండ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. దీని గురిచి చాలా గొప్పగా ప్రకటించాలనుకున్న అక్షయ్ ఏ హీరో చేయని సాహసానికి పూనుకున్నారు. ఒంటికి నిప్పంటించుకుని స్టేజిపై నడిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ ఆయన భార్య మాత్రం దీనిపై ట్విట్టర్ వేదికగా మండిపడింది. ‘‘ఛీ.. నీ ఒంటికి నువ్వే నిప్పంటించుకోవడానికి ఈ విధానాన్ని ఎంచుకున్నావన్నమాట. ఈ విన్యాసం చేసిన తర్వాత కూడా బతికే ఉంటే ఇంటికిరా నిన్ను నేను చంపేస్తాను’’ అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన అక్షయ్.. ‘ఇప్పుడు నాకు ఇంటికెళ్లాలంటే భయం వేస్తోంది’ అంటూ సరదాగా కామెంట్ చేశారు.