Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్య తరువాత బీజేపీ ప్రభుత్వంపై దేశమంతా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మేధావులు, జర్నలిస్టులే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా ఈ హత్య గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. గౌరీలంకేశ్ హత్యలో బీజేపీ మద్దతుదారుల ప్రమేయముందని వార్తలొస్తున్న నేపథ్యంలో ప్రధానికి సైతం నిరసనల సెగ తగులుతోంది. ఈ నిరసనలు ఎక్కడిదాకా వెళ్లాయంటే ట్విట్టర్ లో నెటిజన్లు కొందరు ఆయన్ను బ్లాక్ చేస్తున్నారు.
గౌరీలంకేశ్ హత్య జరిగిన తరువాత నిఖిల్ దధీచి అనే వ్యక్తి వివాదాస్పద కామెంట్లు చేశాడు. ఆమెకు తగిన శాస్తి జరిగిందని, ఇక మిగతాకుక్కలు కూడా నోరుమూసుకుంటాయని వ్యాఖ్యానించాడు. బూతుపదాలు ఉపయోగిస్తూ ట్వీట్లు చేశాడు. నిఖిల్ దధీచిని అనుసరిస్తున్న వారిలో అనేకమంది రాజకీయ నాయకులతోపాటు ప్రధానమంత్రి కూడా ఉన్నారు. దీన్ని గమనించిన సామాజికవేత్త డా. రాకేశ్పారిఖ్ పాత్రికేయుల హత్యకు నరేంద్రమోడీ మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. నిఖిల్ దధీచి అకౌంట్ ను ప్రధాని అన్ ఫాలో చేసే వరకు ఆయన అకౌంట్ ను ఎవరూ అనుసరించవద్దని ప్రచారం ప్రారంభించారు. #బ్లాక్ నరేంద్రమోడీని ప్రయోగించారు. రాకేశ్ పారిఖ్ వాదనకు మద్దతుగా అనేకమంది నెటిజన్లు ప్రధాని అకౌంట్ ను అన్ ఫాలో చేసి బ్లాక్ చేస్తున్నారు. ట్విట్టర్ లో ఇప్పుడిది ట్రెండ్ గా మారింది. ట్విట్టర్లో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న ప్రధానిని గౌరీ లంకేశ్ హత్య నేపథ్యంలోయూజర్లు బ్లాక్ చేయటం తీవ్ర చర్చనీయాంశం అయింది.
మరిన్ని వార్తలు: