అమెరికాలో తెలుగు హీరోయిన్స్‌తో కిషన్ మరియు ఆయన భార్య చంద్రలు వ్యభిచారం చేయిస్తున్నట్లుగా గుర్తించని పోలీసులు దాదాపు మూడు నెలల పాటు విచారణ చేపట్టి, చివరకు వారు వ్యభిచారం చేస్తున్నట్లుగా నిర్థారణకు వచ్చారు. సెక్స్ రాకెట్ వ్యవహారంలో పోలీసులు తీగ లాగితే డొంక అంతా కదులుతుంది. ఇప్పటి వరకు కిషన్ ఎంత మంది హీరోయిన్స్‌తో సంప్రదింపులు జరిపాడు, ఎంత మందితో వ్యభిచారం చేయించాడు అనే విషయాలను పోలీసులు లెక్క తేల్చే పనిలో ఉన్నారు. ఈ సమయంలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు ముఖ్యమైన స్టార్ హీరోయిన్స్ పేర్లు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు హీరోయిన్స్ నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి అమెరికా చెక్కేస్తూ ఉంటారు. వారు సినిమాలతో పాటు అమెరికాలో షోలు అంటూ బిజీగా గడుపుతూ ఉంటారు.
ఆ ఇద్దరు హీరోయిన్స్‌లో ఒకామె ప్రస్తుతం కూడా యంగ్ హీరోలతో వరుసగా చిత్రాలు చేస్తూ ఉంది. ఇక మరో హీరోయిన్ కన్నడంలో సక్సెస్‌ను దక్కించుకుని, అక్కడ నుండి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో స్టార్స్‌తో నటించి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం కూడా సినిమాల్లో నటిస్తూనే ఉంది. రెండు మూడు తమిళ చిత్రాల్లో కూడా చేసిన ఈమె ఈ వ్యవహారంలో ప్రధానంగా వినిపిస్తుంది. ఈ ఇద్దరు హీరోయిన్స్ గురించి మీడియాలో పేర్లతో సహా రాకున్నా కూడా ఇప్పటికే దాదాపు అందరికి ఆ ఇద్దరు ఎవరు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఆ ఇద్దరు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది హీరోయిన్స్ కూడా ఒకటి రెండు సార్లు అమెరికాలో కిషన్ బారిన పడ్డట్లుగా తెలుస్తోంది. ఈ సెక్స్ రాకెట్ వ్యవహారంలో ముందు ముందు మరెన్ని పేర్లు బయటకు వస్తాయో అంటూ సినీ వర్గాల వారు ఆందోళనగా ఎదురు చూస్తున్నారు