సెప్టిక్‌ట్యాంక్‌ను శుభ్రపరిచేందుకు లోపలికి దిగిన ఇద్దరు కార్మికులు మృతువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ దుర్ఘటన కొండాపూర్‌లోని గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్ట్మెంట్లో ఆదివారం జరిగింది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జి.సురేష్, మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు.. కొండాపూర్ గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్ట్మెంట్లోని సెప్టిక్‌ట్యాంక్ శుభ్రం చేయడానికి ప్రైవేటు సెప్టిక్ ట్యాంకర్‌కు సమాచారం ఇచ్చారు.
దీంతో ట్యాంకర్ డ్రైవర్, యజమాని అయిన స్వామి, హెల్పర్ జాన్ కలిసి క్లీనింగ్ చేయడానికి ఒప్పుకొన్నారు.చంపాపేట్ సింగరేణి కాలనీ ఆదర్శనగర్‌కు చెందిన శ్రీనివాస్ అలియాస్ శ్రీను, ఈ ప్రాంతానికే చెందిన ఆంజనేయులు ను సెíప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే పనులకు రావాలని చెప్పారు. వీరిద్దరూ సరే అనడంతో ఆదివారం ఉదయం 8 గంటలకు గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్‌కు ట్యాంకర్‌తో పాటు చేరుకున్నారు. సెప్టిక్ ట్యాంక్ మూతలు తీసి పైపులతో కొంత నీటిని తొలగించారు.