ఇక ఈసారి విడాకులు పక్కా !

Says Fighting For Common Man's Dreams, Not PM's
Says Fighting For Common Man's Dreams, Not PM's

తెలుగుదేశం పార్టీ ప్రవేసపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఏదో విధంగా గట్టెక్కినా బీజేపీకి చిక్కులు తప్పడం లేదు. ఇప్పటి దాకా కొన్ని రోజులు అలిగి మరొకొన్ని రోజులు కలుస్తూ వచ్చిన శివసేన పార్టీ ఇప్పుడు పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనే ఆలోచన చేస్తోన్నట్టు కనపడుతోంది. చాలా రోజుల నుంచి బీజేపీని టార్గెట్ చేసిన శివసేన ఇప్పుడు నేరుగా ప్రధాని మీదే విమర్శలు చేస్తోంది. ఇప్పటి వరకూ శివ సేవ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఇప్పటి వరకూ బీజేపీ పద్దతులను విమర్శిస్తూ సంపాదకీయాలు రాయిస్తూ వచ్చిన శివసేన ఇప్పుడు ఏకంగా తన అధినేత ఇచ్చిన ఇంటర్వ్యూతో మోడీ మీద తామెంత ఆగ్రెసివ్ గా వెళ్లనున్నారో చెప్పిన్నట్టయ్యింది.

అలాగే నాలుగేళ్ల పాటు అత్యంత నమ్మకంగా వ్యవహరించిన మిత్రపక్ష పార్టీ తెలుగుదేశమే అవివిశ్వాస తీర్మానం పెట్టిందంటే అది కచ్చితంగా బీజేపీ తప్పేనని ధాక్రే చెప్పుకొచ్చారు. ఎంత దారుణంగా ఆ పార్టీ వంచించి ఉంటారోనని సామ్నా ఇంటర్యూలో ఉద్ధవ్ చెప్పుకొచ్చారు. అలాగే మొన్న ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్‌కు గైర్హాజరు కావడంపై మాట్లాడుతూ.. ‘ఎవరు ఎవరిపై అవిశ్వాసం చూపాలి. మేం ప్రతిపక్షంతో సాగాలా? కానీ ఇన్నేళ్లూ అవేం చేస్తున్నాయి? ప్రజలను ప్రభావితంచేసే అంశాలపై అవి మాట్లాడుతున్నాయా’ అని ఆక్షేపించారు. ‘‘ఈ దేశంలో ఆవులకు రక్షణ ఉంది. కానీ, మహిళలకు లేదు. వారి బదులు ఆవులను కాపాడుతున్నారు. ప్రపంచంలోనే మహిళలకు భద్రత లేని దేశంగా భారత్‌ మారింది. ఇందుకు సిగ్గుపడాలి’’ అంటూ మోదీ సర్కారుపై ఠాక్రే విరుచుకుపడ్డారు.

నిజానికి శివసేను బుజ్జగించడానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చాలా ప్రయత్నాలు చేశారు. అపాయింట్‌మెంట్ తీసుకుని మరీ వెళ్లి థాకరేల అధికారిక నివాసం మాతోశ్రీకి వెళ్లి చర్చలు జరిపారు. మొన్న అవిశ్వాస తీర్మానం రోజు అనుకూలంగా ఓటేయాలని శివసేన నిర్ణయం తీసుకోవడంతో అంతా సర్దుబాటు అయిందని అనుకున్నారు. కానీ తెల్లవారే సరికి శివసేన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రారంభించింది. దీంతో బీజేపీ నేతలు కూడా ఇక శివసేన తమకు లేదని ఖాయం చేసుకుంటున్నారు. అమిత్ షా కూడా ఆశలు వదిలేసుకుని సొంతంగా పార్టీ బలోపేతం పై దృష్టి సారించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ‘‘ప్రభుత్వంలో మేమూ భాగస్వాములమే. కానీ, తప్పు జరుగుతుంటే తప్పకుండా మాట్లాడతాం. మేం భారతీయ జనతాకు మిత్రులం భారతీయ జనతా పార్టీకీ కాదు అని ఆయన వ్యాఖ్యానించడం ఇక బీజేపీ శివసేన మీద ఆశలు వదులుకునేలా చేస్తోంది.