Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్రమంత్రి ఉమాభారతి చెప్పిన మాట విని మీడియాకు మాట పడిపోయింది. తాను బరువు పెరిగినందుకే శాఖ మార్చారని ఆమె చెప్పిన ఆన్సర్ చాలా కొత్తగా ఉంది. ఇంతవరకూ ఏ రాజకీయ నేత కూడా ఇలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. అసలు బరువుకు, శాఖకూ సంబంధం ఏంటని సహచర మంత్రులు కూడా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారట.
మోడీకి తనపై అసంతృప్తి ఏమీ లేదని చాటుకునే ప్రయత్నం చేసిన ఫైర్ బ్రాండ్ ఉమాభారతి.. ఆ సందర్భంలో గతంలో తనను బరువు తగ్గాల్సిందిగా ప్రధాని ప్రేమగా చీవాట్లు పెట్టారని చెప్పేశారు. అంతకుమించి తన పనితీరుపై ఆయనేమీ అనలేదని, గంగా ప్రక్షాళన కూడా తానైతే బాగా చేస్తాననే ఆశాఖ గతంలో అప్పగించారని చెప్పుకుంటున్నారు ఉమాభారతి.
ఉమాభారతి హిందుత్వ ఛాంపియన్ అయినా.. నమామి గంగ ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదని మోడీపై ఒత్తిడి ఎక్కువైంది. అందుకే బాగా పనిచేసిన గడ్కరీకి అప్పగించారు. గడ్కరీ హయాంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులు పరుగులు పెట్టాయి కాబట్టి.. నమామి గంగ కూడా ఎన్నికల నాటికి కొలిక్కి వస్తుందని మోడీ ఆలోచన. కానీ ఉమాభారతి ఇచ్చిన ట్విస్టు మాత్రం బీజేపీలో, ఆరెస్సెస్ లో కూడా చర్చనీయాంశమైంది.
మరిన్ని వార్తలు: