మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు ఉమాపతి. మార్కులు కొట్టు- విమానం ఎక్కు అంటూ పేద విద్యార్థులకి ఉమాపతి బంపర్ అఫర్ ఇచ్చారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనపాలెం గ్రామానికి చెందిన ఉమాపతి అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకి ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చాడు. 10వ తరగతి బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన వారికి విమానం ఎక్కే అవకాశం కల్పిస్తామని పాఠశాల విద్యార్థులకి ఆయన వాగ్దానం చేసినట్లు తెలిసింది.
వాగ్దానం చేసినట్లుగా, మే 17వ తేదీన, నలుగురు విద్యార్థులు- పురుషోత్తం (552), విష్ణు (515), మహా (509), తనూజ (504)– పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు చెన్నై నుండి విమానంలో బయలుదేరారు. హైదరాబాద్ చేరుకుని 2 రోజుల పాటు నగరంలో బస చేసి నగర పర్యటనకి వెళ్తున్నారు. యాత్ర ఖర్చులు మొత్తం ఉమాపతి నే చూసుకుంటున్నారు.