కరోనా ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. ప్రపంచ దేశాలు అతలాకుతలమయ్యయి. కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ లోకి వెళ్లాయి. దీంతో ఆయా సంస్థలు నడపలేని పరిస్థితి. ఈ తరుణంలో పలు దేశాల్లో ఆయా సంస్థల ఉద్యోగులపై కరోనా ప్రభావం చూపింది. కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచాన్ని మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది కరోనా కారణంగా నిరుద్యోగులుగా మారారని అంతర్జాతీయ గణాంకాలు కోడై కూస్తున్నాయి. మరి.. రష్యాలో పరిస్థితి మరింత ఘోరంగా మారింది. అదేమంటే.. రష్యాలోని బార్లు, రెస్టారెంట్లు, కెఫేల యజమానులు, షెఫ్ లు కనీస నెలవారీ ఆదాయం లేక నానా అవస్థలు పడుతున్నారు.