తెలుగులో ఊహించని విధంగా “లియో”కి మంచి రెస్పాన్స్

తెలుగులో ఊహించని విధంగా “లియో”కి మంచి రెస్పాన్స్
Cinema News

ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సెన్సేషనల్ యాక్షన్ సినిమా “లియో” అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా పై హైప్ అయితే వేరే లెవెల్లో ఉంది. విజయ్ గత సినిమా లు అన్నీ ఒకెత్తు అయితే ఒక్క ఈ “లియో” కి మరొక ఎత్తు అని చెప్పుకోవాలి . విజయ్ తెలుగులో మార్కెట్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ట్రై చేస్తుండగా ఇపుడు అది భారీ స్థాయికి చేరుకున్నది .

తెలుగులో ఊహించని విధంగా “లియో”కి మంచి రెస్పాన్స్
Leo Movie

అది కూడా ఎంతలా అంటే ఇది వరకు తన మూవీ లకి తెలుగులో తాను రాకపోయినా కనీసం సినిమా యూనిట్ ప్రమోషన్స్ కానీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆ మూవీ దర్శకుడు చిత్ర యూనిట్ తో చేసేవారు కానీ ఇలాంటివి ఏమి కూడా లియో కి లేకుండానే భారీ బుకింగ్స్. ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో జరుగుతున్నాయి. దీనితో అసలు తెలుగులో ఇది ఊహించనిది అని చెప్పాలి. మరి ముందు రోజుల్లో అయితే విజయ్ మూవీ లకి ఎలా ఉంటుందో చూడాలి.