అప్పట్లో చంద్రబాబు ఐటి ఐటీ అనేవాడని.. పాపం ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్ లో ఉన్నాడు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన గురించి మాట్లాడవద్దేమో కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ ఐటీతో గ్రామాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు. అంటూ పేర్కొన్నాడు. కర్ణాటక, గుజరాత్, పంజాబీ, మహారాష్ట్ర, ఢిల్లీలలో కరెంట్ కోతలు ఉన్నాయి.. కానీ తెలంగాణలో కరెంట్ కోతలు లేవు అని తెలిపాడు.
అప్పుడు ఉద్యమంలో, ఇప్పుడు అభివృద్ధిలో అగ్రస్థానంలో సిద్ధిపేట ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని పలు సామూహిక భవనాల మంజూరు పత్రాలను మంత్రి హరీష్ రావు అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమం చేసిన గడ్డ సిద్దిపేట.. నాడు ఉద్యమంలో ముందున్నాం. అభివృద్ధిలో కూడా తాము ముందుటామని అన్నారు. అన్ని సిద్దిపేట, గజ్వేల్ లోనే అభివృద్ధి చేసినారు అని టీపీసీసీ అధ్యక్షుడు అంటున్నాడు.సిద్దిపేట తెలంగాణ ఉద్యమ గడ్డ, సిద్దిపేట ప్రజలు రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన్నానని ఆయన పేర్కొన్నారు..
తెలంగాణ ఏ సెక్టార్ లో చూసిన వృద్ది రేటులో ముందుంది..దేశంలో నే అతి ఎక్కువ తలసారి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి పక్షాలు తిట్లలో పోటీ పడితే మేము అభివృద్ధిలో పోటీ పడుతున్నామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తాము ఉద్యమం చేసే సమయంలో ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు.