‘దబిడి దిబిడి’ సాంగ్ పై పోస్ట్ కు ఊర్వశీ ఘాటు రిప్లై

Urvashi's harsh reply to the post on the song 'Dabidi Dibidi'
Urvashi's harsh reply to the post on the song 'Dabidi Dibidi'

నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో “డాకు మహారాజ్” మూవీ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా లో ‘దబిడి దిబిడి’ సాంగ్ కు మంచి ఆదరణ దక్కింది. అయితే, ఈ సాంగ్ లోని స్టెప్స్‌పై సినీ క్రిటిక్ కేఆర్కే (KRK) సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు ఇండస్ట్రీ వాళ్లు ఇలాంటి సాంగ్స్ చేసేకంటే పోర్న్ ఫిల్మ్స్ తీస్తే బెటర్ అని, ఊర్వశీ కూడా సిగ్గుపడాలని పోస్ట్ పెట్టాడు.

Urvashi's harsh reply to the post on the song 'Dabidi Dibidi'
Urvashi’s harsh reply to the post on the song ‘Dabidi Dibidi’

కాగా క్రిటిక్ కేఆర్కే పోస్ట్ పై ఊర్వశీ కౌంటర్ ఇస్తూ.. ‘ఏమీ సాధించలేదని కొందరు నిరంతరాయంగా శ్రమించే వారిని విమర్శించే అర్హత కలిగి ఉండటం విడ్డూరం. నిజమైన పవర్ ఇతరులని కించపరచడం కాకుండా వారిని పైకి లేపడంలో ఉంటుంది’ అని ఊర్వశీ ఘాటుగా మెసేజ్ పెట్టింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. చాందినీ చౌదరి ఈ మూవీ లో కీలక పాత్రలో నటిస్తోంది.

ఇక ఈ సినిమా కి తమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అన్నట్టు మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ లో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా హైలైట్ గా ఉంటాయట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ అని, ఆ ఎపిసోడ్ లోని బాలయ్య – ప్రగ్యా జైస్వాల్, చిన్న పాప పాత్రల మధ్య వచ్చే ఎమోషన్స్ ఆడియెన్స్‌ని కట్టిపడేస్తాయని తెలుస్తోంది. ఎలాగూ బాలయ్య మూవీ లో యాక్షన్ అద్భుతంగా ఉంటుంది.