కొరియాకు రివర్స్ పంచ్

us-warns-north-korea-by-successful-missile-testing

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగించిన ఉత్తరకొరియా.. అది కేవలం కర్టన్ రైజరేనని తేల్చింది. తమ అసలు లక్ష్యం గువామీ ద్వీపమేనని తేల్చింది. దీంతో అమెరికా అప్రమత్తమైంది. తమ అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థను పరీక్షించుకుంది. కొన్ని వారాల క్రితం చేసిన ఈ పరీక్ష విఫలమైనా.. ఈసారి మాత్రం విజయవంతమైంది. దీంతో పెంటగన్ ప్యాంగ్ యాంగ్ కు వార్నింగ్ ఇచ్చినట్లైంది.

అటు జపాన్, ఇటు సౌత్ కొరియా రెండూ మిత్రదేశాలు కావడంతో.. అమెరికా వ్యూహాత్మకంగా కొరియా దాడిని కాచుకోవడానికి పావులు కదుపుతోంది. ఏమాత్రం తన భూభూగాన్ని కవ్వించినా యుద్ధం మొదలుపెట్టాలన్న ఆత్రుతతో ఉన్నారు ట్రంప్. వార్ బిగినైతే ప్రపంచ పటంలో కొరియా ఉండదని ట్రంప్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. కానీ అటు కిలాడీ కిమ్ కూడా అందుకు రెడీగానే ఉన్నారు.

అమెరికాకు తన పవరేంటో చూపాలని కిమ్ కు చాలా ఉబలాటంగా ఉంది. అందుకే తమ దేశంలో తినడానికి డబ్బుల్లేకపోయినా క్షిపణుల పరీక్షలకు మాత్రం ధనం లేదు అనే మాట రానివ్వడం లేదు. ఏం చేసైనా సరే అమెరికాను సవాలు చేసే రక్షణ వ్యవస్థ ఉండాలని తీర్మానించేశాడు. అందుకే 2012లో గద్దె ఎక్కిందగ్గర్నుంచి అదేపనిగా క్షిపణులు ప్రయోగిస్తూనే ఉన్నాడు. కిమ్ , ట్రంప్ ఇద్దరూ పిచ్చివాళ్లే కాబట్టి.. ఎవరైనా యుద్ధానికి దిగే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి.

మరిన్ని వార్తలు:

ఉండవల్లికి మాట పడిపోయిందా ?

రోజాలో కొత్త భ‌యం

చైనాను వ‌ద‌ల‌ని అల‌వాటు