భారత దేశపు క్రికెట్ క్రీడా కారుడు, భారత మాజీ బౌలర్ యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. యువీ ఇటీవలే అంతర్జాతీయా క్రికెట్‌కు, ఐపీఎల్‌కు టాటా చెప్పేశాడు. విదేశీ లీగుల్లో మాత్రమే బీసీసీఐ అనుమతితో ఆడుతున్నాడు.
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పుట్టిన రోజు సందర్భంగా ఈ టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు.
“హాయ్ మిర్చీ” అంటూ ట్విటర్లో శుభాకాంక్షలు చెప్పాడు. నా నేస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందిస్తూ యువరాజ్ సింగ్ సరదా ట్వీట్‌కు సానియా మీర్జా కూడా రిప్లయ్ ఇచ్చింది. “హాయ్ మోటూ.. థాంక్యూ” అంటూ అంతే సరదాగా బదులు ఇచ్చింది.