అన్ని విమర్శలూ నావే అంటున్న వీహెచ్

v hanumantha rao comments about leaders

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రత్యేక తెలంగాణ కోసం ముందుండి పోరాడిన వీహెచ్.. ఇప్పుడు మాత్రం తెలుగు రాష్ట్రాలకు పిలవని పెద్దనంటున్నారు. ఎవరూ ఆహ్వానించకపోయిన చాలా కార్యక్రమాలకు డైరక్టుగా వచ్చేస్తున్నారు. ఎళాగో వచ్చారుగా పాపం పెద్దాయన అనే మర్యాద కొద్దీ ఉండనిస్తారు. కానీ వీహెచ్ మాత్రం తనది అంతర్జాతీయ స్థాయి అని ఫీలైపోతుంటారు.

ఇప్పుడు లేటెస్ట్ గా తెలుగు రాష్ట్రాల సీఎం ల పద్ధతులై వీహెచ్ సారు మండిపడ్డారు. కేసీఆఱ్, చంద్రబాబుతో కలిసి యువజన కాంగ్రెస్ లో పనిచేసిన వీహెచ్.. అదే చనువుతో ప్రతి చిన్న విషయానికి నేరుగా సీఎంలను టార్గెట్ చేస్తారు. ఇద్దరూ నియంలేనని, తాము చెప్పిందే వేదమన్నట్లుగా పాలిస్తున్నారని ఆరోపించారు వీహెచ్.

తెలంగాణకు ఏమీ చేయని కేసీఆర్.. మద్యాన్ని మాత్రం ఏరులై పారిస్తున్నారని అభిప్రాయపడ్డారు వీహెచ్. ఇప్పటికే బీర్లు, వైన్లకు ఫుల్ పవర్స్ ఇచ్చేసిన కేసీఆర్.. త్వరలో విస్కీ స్కీమ్ తీసుకొస్తారని ఎద్దేవా చేశారు. డ్రగ్స్ కేసులో పెద్దవారిని ఎందుకు వదలిపెడుతున్నారో చెప్పాలని ఆయన కేసీఆర్ ను కోరారు. ఇక ఏపీలో ముద్రగడ పాదయాత్రకు అనుమతి నిరాకరణపై ఉధ్యమిస్తాం అంటున్నారు వీహెచ్.