వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గురించి ఇప్పుడు ఓ వార్త వైరల్ అవుతోంది. వర్మ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని, ఆయనతో కలిసిన వారికి కూడా కరోనా లక్షణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై తనదైన శైలిలో స్పందించిన వర్మ.. కొన్ని మీడియా సంస్థల నుంచి నా ఆరోగ్యంపై పుకార్లు వచ్చిన నేపథ్యంలో.. నేను సూపర్ ఫిట్‌గా ఉన్నానంటూ నా ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నవారికి స్పష్టం చేయాలనుకుంటున్నాను.
పుకార్లు పుట్టించిన వాళ్లు ఈ వార్త అబద్ధం అయినందుకు చాలా బాధపడి ఉంటారు అంటూ తాను డంబెల్ ఎత్తుతున్న వీడియోను షేర్ చేశారు. నేను నాన్‌స్టాప్‌గా ఆసక్తికరమైన సినిమాలు తీస్తున్నాను’ అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా.. ఇటీవలే పవర్ స్టార్ సినిమాని విడుదల చేసిన వర్మ ప్రస్తుతం మర్డర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం రోజున ఇండియాలో తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రకటించారు. ఇది ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ స్టోరీ అని పేర్కొంటూ దానికి డేంజరస్ అనే ఆసక్తికర టైటిల్‌తో ముందుకొచ్చారు.