వివాస్పద వ్యాఖ్యలు, తర్కించే ప్రశ్నలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో తెలిసిందే. వర్మ స్పందించాడంటే అది ఏ విషయమైన చర్చనీయాంశమవ్వాల్సిందే. ఈ క్రమంలో ట్విట్టర్‌లో క్రమం తప్పకుండా వివిధ అంశాలపై స్పందించే వర్మ ఎప్పుడు ఎవరిని టార్గేట్ చేస్తాడో తెలియదు. ఆయన ట్వీట్ వచ్చిందంటే అంటే చాలు ఎవరో ఒకరిని టార్గేట్ చేశాడనే అర్థం.
ఈ నేపథ్యంలో తాజాగా వర్మ చేసిన ట్వీట్ మరోసారి చర్చనీయాంశమైంది. కానీ ఈసారి ఎవరిని టార్గేట్ చేయని వర్మ కొత్తగా తన బాల్యం గురించి చెప్పుకొచ్చాడు. కాగా ఆర్జీవీ తన వ్యక్తిగత విషయాలను చెప్పడంలో అంతగా ఆసక్తి చూపడనే విషయం తెలిసిందే. అలాంటి ఈసారి ఎవరూ ఊహించని రితీలో తన బాల్యంలోనే తన భావాలను ట్వీట్‌లో వివరించాడు.
ఇంతకి వర్మ ఏమన్నాడంటే.. ‘పెద్దవాళ్లు మాత్రమే పిల్లలను పిల్లలుగా చూస్తుంటారు. కానీ ఏ పిల్లలు మాత్రం తమని తాము చిన్నిపిల్లలం అని ఎప్పుడూ అనుకోరు. నేను అయితే నా చిన్నతనంలో పెద్దవాళ్లంతా ఇడియట్స్ అనుకనేవాడిని. అందుకే ఎప్పటికి నేను పెద్దవాడిని కావోద్దని కోరుకునే వాడిని’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. పెద్దవాళ్లపై వర్మ ఆలోచనలు చూసి నెటిజన్లు తమదైన శైలో స్పందిస్తున్నారు.