Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘పటాస్’, ‘సుప్రీం’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకుని హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్న అనీల్ రావిపూడి తర్వాత సినిమా గురించి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అనీల్‌రావిపూడి తన తర్వాత సినిమాను మెగా హీరోలతో మలీస్టారర్ చిత్రం చేయబోతున్నాడు అంటూ సమాచారం అందుతుంది. దిల్‌రాజు నిర్మాణంలో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు కలిసి అనీల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే కథ చర్చలు కూడా పూర్తి అయ్యాయి, ఈ సంవత్సరం చివర్లోనే సినిమాను ప్రారంభించి, వచ్చే సంవత్సరం రెగ్యులర్ షూటింగ్‌కు తీసుకు వెళ్లనున్నారు.
అనీల్ రావిపూడి తాజాగా ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మెగా హీరోలు కలిసి ఈయన దర్శకత్వంలో నటించేందుకు ముందుకు వచ్చారు. దిల్‌రాజు కూడా కథపై నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ సినిమాకు దిల్‌రాజు ‘ఎఫ్2’అనే టైటిల్‌ను రిజిస్ట్రర్ చేయించాడు. ‘ఎఫ్2’కు ట్యాగ్‌లైన్‌గా ఫన్ అండ్ ఫ్రస్టేషన్. ఇద్దరు హీరోల్లో ఒకరు ఫన్ చేస్తూ ఉంటే, మరో హీరో ఎప్పుడు కూడా ఫ్రస్టేషన్‌తో కనిపిస్తాడు అంటూ టైటిల్‌ను బట్టి అర్థం అవుతుంది. వచ్చే సంవత్సరం వేసవి చివరి వరకు సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా అనీల్ రావిపూడి సన్నిహితులు చెబుతున్నారు. దిల్‌రాజు బ్యానర్లో అవ్వడంతో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి మెగా ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెగా మల్టీస్టారర్ ఇన్నాళ్లకు సాధ్యం కాబోతుంది. మెగా హీరోలు మెగా ఫ్యాన్స్‌ను సంతృప్తి పర్చుతారా అనేది చూడాలి.