మెగా వార్‌.. ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గడం లేదు

Varun Tej Toliprema vs Sai Dharam Tej Intelligent

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో ప్రస్తుతం మెగా హీరోల హవా సాగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు హీరోలు ప్రస్తుతం హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే హీరోల మద్య అవగాహణ మరియు వారితో సినిమాలు నిర్మించే నిర్మాతల మద్య సయోద్య ఉన్న కారణంగా ఇప్పటి వరకు ఏ ఇద్దరు మెగా హీరోల చిత్రాలు ఒకే రోజున విడుదల అయిన దాఖలాలు లేవు. కాని వచ్చే నెల 9న మెగా హీరోలు ఇద్దరు మొదటి సారి ఢీ కొట్టబోతున్నారు. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటించిన ‘తొలిప్రేమ’ మరియు సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన ‘ఇంటిలిజెంట్‌’ చిత్రాలు ఒకే రోజు విడుదలకు సిద్దం అవుతున్నాయి. 

వరుణ్‌ తేజ్‌ నటించిన ‘తొలిప్రేమ్‌’ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. పవన్‌ టైటిల్‌ అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా వెంకీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. చాలా కాలం క్రితమే ఈ చిత్రం విడుదల తేదీ ఫిబ్రవరి 9 అని ఖరారు చేయడం జరిగింది. తాజాగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘ఇంటిలిజెంట్‌’ చిత్రాన్ని కూడా అదే తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. వినాయక్‌ దర్శకత్వంలో సి కళ్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం అనుకున్న సమయం కంటే ముందే షూటింగ్‌ పూర్తి అవ్వడంతో వెయిట్‌ చేయడం ఎందుకని ముందే విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి చివరి నుండి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ తర్వాత పెద్ద సినిమాలు ఉన్నాయి. ఫిబ్రవరి 9న విడుదల చేయలేక పోతే మే వరకు డేట్లు ఖాళీ లేవు. ఆ కారణంగానే వరుణ్‌తో ఢీ కొట్టేందుకు సాయి ధరమ్‌ తేజ్‌ సిద్దం అవుతున్నాడు. మెగా హీరోలిద్దరిలో ఎవరు సక్సెస్‌ అవుతారు అనేది చూడాలి.