Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Venkaiah Naidu Controversy Comments on Mamata Benarji Government
బీజేపీలో మాటల మరాఠీ అంటే వెంకయ్య పేరే చెబుతారు. అంతెందుకు ఎన్నికల సమయంలో మోడీ కూడా వెంకయ్య సూచనలు తీసుకుంటారని ఛలోక్తులు కూడా ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వెంకయ్య మరోసారి రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జూలు విదిల్చారు.
తెలుగు రాష్ట్రాల్లో కోవింద్ టూర్ ను దగ్గరుండి పర్యవేక్షించిన వెంకఏ అభ్యర్థికి ఎదురేలేదన్నట్లుగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఎన్డీయేతర పార్టీలు కూడా మద్దతిస్తున్నాయని చెబుతూ.. తృయ్య… ఎన్డీణమూల్ ప్రస్తావన తేవడంతో అందరూ అవాక్కయ్యారు. మమత ఎప్పుడు మద్దతు పలికారని అంతా కన్ఫ్యూజ్ అయ్యారు.
కానీ త్రిపుర తృణమూల్ కాంగ్రెస్ లో సంక్షోభాన్ని వెంకయ్య తనదైన శైలిలో అన్వయించారని అందరికీ ఆలస్యంగా అర్థమైంది. ప్రత్యర్థి పార్టీల్లో కుమ్ములాటల్ని కూడా వెంకయ్య ఇలా చెప్పడం బాగోలేదని కొందరంటే.. వెంకయ్య అంటే అదేనని ఆయన సన్నిహితులు మాత్రం చంకలు గుద్దుకుంటున్నారు.
మరిన్ని వార్తలు: