వెంకీ, తేజ మూవీ క్యాన్సిల్‌.. అసలేం జరిగింది?

venkatesh and teja movie canceled

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వెంకటేష్‌ హీరోగా తేజ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది అంటూ గత రెండు మూడు నెలలుగా సోషల్‌ మీడియా మరియు వెబ్‌ మీడియాలో తెగ ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. వెంకటేష్‌తో చాలా కాలంగా సినిమా చేయాలని తేజ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తేజకు గత కొంత కాలంగా సరైన సక్సెస్‌ లేదు అనే కారణంగా వెంకటేష్‌కు తేజ నో చెబుతూ వచ్చాడు. ఇటీవల రానా హీరోగా తేజ దర్శకత్వంలలో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా సక్సెస్‌ అయిన వెంటనే తేజ దర్శకత్వంలో సినిమా చేసేందుకు వెంకీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అదే సమయంలో తేజకు బాలకృష్ణతో సినిమా ఛాన్స్‌ దక్కింది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ను మొదలు పెట్టే సమయంకు వెంకీ సినిమా పూర్తి చేయాలనే పట్టుదలతో తేజ ఉన్నాడు.

కేవలం మూడు నెలల్లో వెంకీ హీరోగా తేజ పూర్తి చేస్తాను అంటూ ముందుకు వచ్చాడు. ప్రస్తుత కాలంలో ఒక చిత్రాన్ని మూడు నెలల్లో పూర్తి చేయడం అంటే అది ఫలితం బెడిసి కొట్టే ప్రమాదం ఉందని, కనీసం ఆరు నెలలు సమయం తీసుకుని మెల్లగా సినిమాను చేయాలని తేజకు వెంకటేష్‌ సూచించడం జరిగింది. అందుకు తేజ తాను ముందే కమిట్‌ అయిన ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర చిత్రానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, అందుకే మూడు నెలల్లో పూర్తికి ఒప్పుకున్నట్లయితే షూటింగ్‌కు వెళ్దాం లేదంటూ వదిలేదాం అంటూ తేజ చెప్పడం జరిగింది. దాంతో వెంకటేష్‌ తన తదుపరి చిత్రాన్ని పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. ఆకాష్‌ పూరితో మెహమూబా చిత్రాన్ని చేస్తోన్న పూరి జగన్నాధ్‌ ఆ తర్వాత వెంకటేష్‌తో చిత్రాన్ని చేసే అకాశం ఉంది. మార్చి నుండి తేజ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్‌ చిత్రం మొదలు కాబోతుంది.