నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఫిదా సక్సెస్ తో జోరుమీడున్నాడు. ప్రస్తుతం ఇతగాడు రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒక్కటి అంతరిక్షం, మరో చిత్రం వెంకటేష్ తో కలిసి నటిస్తున్నా మల్టీ స్టారర్ ఎఫ్2. ఈ రెండు చిత్రాలు నెల గ్యాప్ లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వరుణ్ కు పెద్ద చిక్కు వచ్చి పడిందంట. ఈ సంక్రాంతి కి రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధం గా ఉన్నాయి. ఒక్కటి బోయపాటి దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరో గా తెరకెక్కిన చిత్రం వినయ విధేయ రామ, మరొక్కటి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ రెండు చిత్రాలతో పోటి పడి చిన్న చిత్రం ఎఫ్2 ను విడుదల చెయ్యాలి అని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. ఇలా విడుదలై హిట్ట్ కొట్టిన సినిమాలు దిల్ రాజువి చాలానే ఉన్నాయి.
పోయిన సంక్రాంతికి చిరంజీవి నటించిన ఖైది నెంబర్ 150, బాలకృష్ణ గౌతమి పుత్రా శాతకర్ణి చిత్రాలతో చిన్న చిత్రం గా ఎ మాత్రం అంచనాలు లేకుండా నిర్మాత దిల్ రాజు నుండి వచ్చినా చిత్రం శతమానం భవతి ఈ చిత్రం మంచి టాక్ తో సక్సెస్ పుల్ గా నడిచింది.ఇప్పుడు దిల్ రాజు మరల అదే ప్రయోగాన్ని చేయానున్నాడు. రెండు పెద్ద సినిమాలతో పోటి పడి. ఎఫ్2 చిత్రాన్ని విడుదల చెయ్యాలి అని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. ఇదే కనుక జరిగితే వరుణ్ తేజ్ కు ఇబ్బందులు తప్పవు. వరుణ్ తేజ్ అంతరిక్షం చిత్రం వరుణ్ కెరీర్ లో తొలి ప్రయోగాత్మక సినిమా కావడం. ఎఫ్ 2 స్టొరీ కూడా పాతదే, ఈ చిత్రం నుండి ఒక్క ఫస్ట్ లుక్ తప్ప మరోటి విడుదల కాలేదు. పాత కథే కాబట్టి సినిమాలో అంత మేటర్ కూడా ఏమి ఉండదు అని తెలుస్తుంది. ఇవ్వని చూస్తే సినిమా వాయిదా పడితే బెటర్. కానీ వెంకటేష్ లాంటి హీరోతో వస్తున్నా మల్టీ స్టారర్ చిత్రం కాబట్టి దిల్ రాజు ఈ చిత్రం విషయంలో రాజిపడకపోవచ్చు అంటున్నారు.