నవంబరు 20న ‘ప్రత్యేక సందర్భాల’
శ్రీవారి సేవ స్లాట్ విడుదల
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రస్తుతం శ్రీవారి సేవలో 7 రోజులు, 3 రోజులు, 4 రోజుల స్లాట్లలో సేవలందించేందుకు ఆన్లైన్ అప్లికేషన్లో మార్పులు తీసుకురావడం జరిగింది. 3 రోజుల స్లాట్‌కు సంబంధించి 25 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు.
4 రోజులు, 7 రోజుల స్లాట్లకు 18 నుంచి 60 ఏళ్లలోపు వారిని అనుమతిస్తారు. ఈ మూడు స్లాట్లు కాకుండా తాజాగా ప్రత్యేక సందర్భాల్లో భక్తులకు సేవలందించేందుకు 25 నుంచి 40 ఏళ్ల లోపు గలవారికి 3 రోజుల పాటు సేవ చేసే అవకాశం కల్పించనున్నారు.
7 రోజుల స్లాట్‌కు ఆఫ్‌లైన్, ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశముంది. 3 రోజులు, 4 రోజులు, ప్రత్యేక సందర్భాల స్లాట్లకు సంబంధించి ఆన్లైన్ ద్వారా మాత్రమే నమోదు చేసుకోవాలి. ఆన్లైన్లో భక్తులు తప్పనిసరిగా ఆధార్ నంబరుతో శ్రీవారి సేవకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సేవకు రిపోర్టు చేసే సమయంలో ఆధార్ కార్డును వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
3 రోజుల స్లాట్‌కు వచ్చేవారు గురువారం రిపోర్టు చేయాలి. శుక్ర, శని, ఆదివారాల్లో సేవ చేయాల్సి ఉంటుంది. 4 రోజుల స్లాట్‌కు వచ్చేవారు ఆదివారం రిపోర్టు చేయాలి. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో సేవలందించాల్సి ఉంటుంది.
7 రోజుల స్లాట్‌కు వచ్చేవారు మంగళవారం రిపోర్టు చేయాలి. బుధ, గురు, శుక్ర, శని, ఆది, సోమ, మంగళవారాల్లో సేవ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక సందర్భమైన వైకుంఠ ఏకాదశికి సంబంధించి డిసెంబరు 28న రిపోర్టు చేయాలి. డిసెంబరు 29, 30వ తేదీల్లో సేవ చేయాల్సి ఉంటుంది.
టిటిడి వెబ్సైట్ www.tirumala.orgలో ‘శ్రీవారిసేవ’ అనే లింక్‌ను క్లిక్ చేసి ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.
విడివిడిగా నమోదు చేసుకోవాలి:
”ప్రత్యేక సందర్భాల” శ్రీ వారిసేవ ఆన్ లైన్ స్లాట్ కోసం విడివిడిగా భక్తులు నమోదు చేసుకోవాలి.