వేణు స్వామి షాకింగ్ డిసిషన్: ‘భవిష్యత్తులో జ్యోతిష్యాలను చెప్పను’…

Venu Swami's shocking decision: 'I will not tell astrology in the future'.
Venu Swami's shocking decision: 'I will not tell astrology in the future'.

జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయాలు, క్రికెట్, సినిమా వంటి టాపిక్‌లు ఏవైనా సరే తన ప్రెడిక్షన్స్ ఇస్తూ ఉంటారు. అయితే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన తాజా స్పందన ట్రోలింగ్‌కు కారణమైంది. కొన్ని ఇంటర్వ్యూల్లో అధికార వైసీపీ విజయం సాధిస్తుందని, జగన్ మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని స్పష్టంగా చెప్పారు. కానీ, ఎన్నికల్లో కూటమి (టీడీపీ+జనసేన+బీజేపీ) విజయకేతనం ఎగురవేయడంతో సోషల్ మీడియాలో ఆయనను తీవ్రంగా విమర్శించారు. తన ప్రెడిక్షన్ తప్పిందని అంగీకరిస్తూ, అందుకు సంబంధించిన వీడియో వదిలారు.

Venu Swami's shocking decision: 'I will not tell astrology in the future'.

తన ప్రిడిక్షన్ తప్పటంతో, వేణు స్వామి సంచలన నిర్ణయం ప్రకటించారు. “నా ప్రిడిక్షన్ పూర్తిగా తప్పిందని ఒప్పుకుంటున్నాను. ఈ రోజు నుంచి రాజకీయ, సినిమా పరిశ్రమకి సంబంధించిన విశ్లేషణలు, ప్రెడిక్షన్స్  చెప్పడం మానేస్తున్నాను. జగన్ జాతకాన్ని విశ్లేషించడంలో విఫలమయ్యాను, అందువల్ల ఇకపై పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఎవరి వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషించను” అని ఆయన స్పష్టం చేశారు.