వెంకటేష్‌ కూతురు లవ్‌ మ్యారేజ్‌..!

venkatesh daughter ashritha

తెలుగు స్టార్‌ హీరో వెంకటేష్‌ పెద్ద కూతురు అశ్రిత ప్రేమలో పడ్డుట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. గత కొన్నాళ్లుగా ప్రముఖ వ్యాపారవేత్త సురేందర్‌ రెడ్డి మనవడితో అశ్రిత ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి ప్రేమ ఇటీవల పెద్దలకు తెలియడం జరిగింది. ప్రస్తుతం వెంకటేష్‌ ‘ఎఫ్‌ 2’ చిత్రం షూటింగ్‌ నిమిత్తం విదేశాల్లో ఉన్నాడు. ఆయన రాకకు టైం పట్టే అవకాశం ఉంది. అందుకే సురేష్‌ బాబు అమ్మాయి తరపున వెళ్లి సురేందర్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లుగా సమాచారం అందుతుంది. అశ్రితను వారు తమ ఇంటి కోడలిగా చేసుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట.

Venkatesh
వెంకటేష్‌ ఇండియా తిరిగి రాగానే వివాహ నిశ్చితార్థంకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు అయ్యే అవకాశం ఉంది. వచ్చే నెలలోనే అశ్రిత నిశ్చితార్థం ఉంటుందనే టాక్‌ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. గత కొంత కాలంగా బేకరి స్టాల్స్‌ నిర్వహిస్తున్న అశ్రిత త్వరలోనే పెళ్లికి సిద్దం కాబోతుంది. వ్యాపారంపై అభిరుచి ఉన్న అశ్రిత పెళ్లి తర్వాత కూడా వ్యాపారంలో కొనసాగానే ఆసక్తిని కనబర్చుతుంది. మరో వైపు అశ్రిత ప్రేమించిన అబ్బాయి గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అబ్బాయి ఏం చేస్తాడు, అబ్బాయిని వెంకటేష్‌ హీరోగా తీసుకు వస్తాడా ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అబ్బాయి ఎలా ఉంటాడు అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ఆస్తుడు అయినా రామిరెడ్డి తనయుడే అశ్రితకు కాబోయే భర్త అంటూ సమాచారం అందుతుంది.