విద్యాబాలన్ కు రోజుకు అంతాన

Vidya Balan Remuneration for NTR Biopic

క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రాని క్రిష్ మాజీ ముఖ్య మంత్రి నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందినా స్టార్ హీరోస్ అండ్ హీరోయిన్స్ నటించారు. ఒక్కొక్కరికి ఒక్కటి లేదా రెండు రోజులు మాత్రమే కాల్షీట్ ఉంటాయి. కాబట్టి వీరు తీసుకున్నా పారితోషకం కూడా చాలా తక్కువే. అందరికన్నా ఎక్కువగా ఈ సినిమాలో ఎక్కువ రోజులు నటించింది బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్, క్రిష్ మొదట ఎన్టీఆర్ భార్య పాత్రకు చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ ఎవ్వరు ఫైనల్ అవ్వలేదు. అందుకోసం బాలీవుడ్ నుండి తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నపుడు విద్యాబాలన్ గారు కరెక్ట్ గా బసవతారకం పాత్రకు సెట్ అవ్వుతారు అనిపించింది. అందుకు ముంబాయి వెళ్లి విద్యాబాలన్ అప్పాయింట్మెంట్ తీసుకోని ఆమెకు కథ చెప్పి ఒప్పించడం జరిగింది అందుకు ఆమె మాకు 15 రోజులు కాల్షీట్స్ ఇచ్చింది.

ఒక్కో కాల్షీట్స్ కు రోజుకు 5 లక్షలు చొప్పునా ఆమె పారితోషకం తీసుకుంది అంతేనా ఆమె ఉండటానికి హోటల్, భోజనం, పర్సనల్ మేకప్ మాన్, క్యారివాన్ ఇవ్వని కలిపి మొత్తం కోటి రూపాయల దాక ఖర్చు వచ్చింది. బాలకృష్ణ కూడా ఆమెకు అంత అమౌంట్ ఇవ్వడానికి వెనకాడలేదు. ఎన్టీఆర్ బయోపిక్ లో దాదాపుగా ఆమెనే హైలైట్ చేస్తూ చూపించారు. మనం చుసిన ట్రైలర్ లో ఎలాగో తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు వచ్చే ఏడాది జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఎన్టీఆర్ మహానాయకుడు మాత్రం ఫిబ్రవరి 7 న విడుదల చేస్తారు.