విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఈ పేరుకు యూత్‌లో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. సహా నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ‘రౌడీ’.. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డితో హీరో మారి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో నటించిన చిత్రం ‘పుష్పక విమానం’. ఈ మూవీని విజయ్ నిర్మించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్‌లో భాగంగా విజయ్, ఆనంద్‌లు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి సంబంధించిన ఆసక్తికర విషయాలను, చిన్ననాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఒకరి గురించి ఒకరు ఈ దేవరకొండ బ్రదర్స్ ఏం చెప్పారో వారి మాటల్లో చూద్దాం.
ఈ మేరకు ఆనంద్, విజయ్‌లలో ఎవరిని ఇంట్లో ఎక్కువగా గారాబం చేస్తారనే ప్రశ్న ఎదురవగానే వెంటనే విజయ్, ఆనంద్‌ను చూపించాడు. ‘చిన్నప్పటి నుంచి ఆనంద్‌ను చాలా గారాబం చేశారు. ఎంతంటే వాడు ఆటలో జౌట్ అయినా అవ్వలేదు అనేవారు. క్రికెట్ ఆడేటప్పడు వాడు వికెట్ పడేది కానీ మా నాన్న మాత్రం పడేదు జౌట్ కాదని అనేవారు. నాకు అర్థం కాకపోయేది. అక్కడ క్లియర్‌గా కనిపించేది కానీ నాటౌట్ అని అనేవారు. చిరాకు వచ్చి బంతి విసిరేవాడిని. అలా ఒకసారి ఆనంద్‌నే బంతితో కొట్టాను. ఆ తర్వాత ఇంట్లో నాకు చీవాట్లు’ అంటూ నవ్వూతు చెప్పాడు.
విజయ్: ‘ఇద్దరం కలిసి ఆడుకునే సమయంలో ఎప్పుడు గొడవపడే వాళ్లం. ఆనంద్ తను ఆడుకునే బొమ్మలు విరగొట్టుకుని నా బొమ్మలు తీసుకునేవాడు. ఈ విషయంలో ఇద్దరికి గొడవ జరిగేది. ఇక హాస్టల్‌లో ఉన్నప్పుడు నాతో ఎంతో సరదాగా ఉండేవాడు. నా ఫ్రెండ్స్ కూడా వాడి ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్లు. ఎప్పడు నా క్లాస్‌రూంకి రావడం అలా చేస్తుండేవాడు. కానీ సెలవులకు ఇంటికొచ్చినప్పుడు మాత్రం చుక్కలు చూపించేవాడు. టీవీలో వాడికి నచ్చిందే చూడాలి. రీమొట్ తనకు కావాలంటూ అల్లరి చేసేవాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
అని అడగ్గానే ఇద్దరం చేతులు ఎత్తారు. కానీ ఇద్దరిలో కొంచం విజయ్ అంటేనే అమ్మకు ఇష్టమని ఆనంద్ చెప్పుకొచ్చాడు. ‘విజయ్ ఎప్పుడు అమ్మ దగ్గరికి వచ్చిన షూటింగ్ విషయాలు. ఈ రోజు షూటింగ్ ఇలా జరిగింది. అలా జరిగింది. ఆనంద్ ఏం చేస్తున్నాడు’ అంటూ ప్రతి విషయం షేర్ చేసుకోవడంతో విజయ్ అంటే అమ్మకు కాస్తా ఎక్కువ ఇష్టం అని ఆనంద్ తెలిపాడు. వెంటనే విజయ్ అమ్మకు నేను, నాన్నకు వీడు అని చెప్పాడు.
ఆనంద్ ఫస్ట్ సంపాదించాడని విజయ్ చెప్పాడు. ‘ఆనంద్‌కు అమెరికాలో జాబ్ వచ్చింది. ఈ విషయం ఫోన్ చేసి చెప్పగానే ఇంట్లో ఒక్కసారిగా ఏడుపులు. అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇక వాడు యుఎస్ నుంచి రాగానే ఎయిర్‌పోర్టులో వాడి యుఎస్ కార్డు వాడేవాడు. ఆ ఫోటోలను నా ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అకౌంట్ లేదు. అయితే అప్పుడు విజయ్‌ని చూస్తే గర్వంగా ఫీల్ అయ్యాను అని విజయ్ చెప్పాడు.
వెంటనే ఆనంద్ విజయ్‌ను చూపించాడు. దగ్గర దగ్గర 30, 40, 50 వరకు ఉండోచ్చు, సినిమాలోకి రావడానికే ముందే చాలా రిలేషన్స్ ఉండేవి. దీనికి విజయ్ వివరణ ఇస్తూ.. ‘నేను కెరీర్ కోసం ఎక్కువగా ఆలోచించేవాడిని. ఈ క్రమంలో ఎక్కువగా టైం ఇచ్చేవాడిని కాదు. దీంతో అలా రిలేషిప్స్ బ్రేక్ అయ్యేవి. కానీ ఆనంద్ మాత్రం రిలేషన్‌ల్లో చాలా సీరియస్‌గా ఉంటాడు. ప్రేమిస్తే ఇంకా పెళ్లి చేసుకోవడమే. నేను అలా కాదు. ఎప్పుడూ నా ఆలోచనలు నిలకడగా ఉండవు. సో నేను ఇలాంటి రిలేషన్ షిప్‌కు కట్టుబడి ఉండలేను’ అంటూ చెప్పుకొచ్చాడు.