పాపం కుర్రాళ్ళు గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యారు !

కొన్నిసార్లు మనం కొన్ని కొన్ని విషయాలని ముందే అంచనా వేయగాలగాలి లేదా మన దగ్గరకు వచ్చిన అవకాశాలను చేజార్చుకోవాల్సి వస్తుంది. పాపం సూపర్ స్టార్ అల్లుడు సుదీర్ బాబు, నేటి యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ పరిస్థితి అలానే ఉన్నట్టు అనిపిస్తోంది. అతి త‌క్కువ బడ్జెట్‌తో తెర‌కెక్కి చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది బోల్డ్ మూవీ `ఆర్ఎక్స్ 100`. ఇటీవ‌ల విడుద‌లైన మంచి క‌లెక్ష‌న్ల‌తో సాగుతున్న ఈ సినిమా కార్తికేయ కంటే ముందే ఈ ఇద్దరికీ స్టొరీ నేరేట్ చేసాడట సినిమా డైరెక్టర్ అజయ్.

ఈ స్క్రిప్ట్ పట్టుకుని, హీరో సుధీర్ బాబు చుట్టూ దాదాపు మూడు నాలుగు సార్లు, విజయ్ దేవరకొండ దగ్గరకు మూడు నాలుగు సార్లు తిరిగాడట. అయితే ఆ ఇద్దరూ ఆ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో వెనక్కు వచ్చేసి, వేరే ఒకరిద్దర్ని ట్రయ్ చేసి, ఆఖరికి మంచి సబ్జెక్ట్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయకు వినిపించాడు. అంతే ప్రాజెక్టు ఫైనల్ అయింది. తను పుట్టి పెరిగిన ఈస్ట్ గోదావరి ఆత్రేయపురం పరిసర ప్రాంతాల్లోనే మొత్తం షూట్ చేసి, రెండున్నర కోట్ల రేంజ్ లో సినిమా నిర్మాత చేతిలో పెట్టాడు. ఇదే సినిమా సుధీర్ బాబు గాని విజయ్ గానీ చేసుంటే మరింత జోష్ వచ్చుందేదేమో ?