బిచ్చగాడు 3… పై దృష్టి పెట్టిన విజయ్ ఆంటోని! త్వరలోనే ప్రేక్షకుల ముందుకి

బిచ్చగాడు 3... పై దృష్టి పెట్టిన విజయ్ ఆంటోని! త్వరలోనే ప్రేక్షకుల ముందుకి
బిచ్చగాడు 3

‘బిచ్చగాడు’ టైటిల్ అంటేనే ప్రేక్షకులు ఆ సినిమా చూస్తారా లేదా అనే సందేహం కలుగుతుంది. ఇక అదే టైటిల్ తో రెండు సార్లు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం అంటే సాహసం అనే చెప్పాలి . విజయ్ ఆంటోని నుంచి వచ్చిన ‘బిచ్చగాడు 2’ భారీకలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ‘బిచ్చగాడు’ సినిమా తల్లి సెంటిమెంట్ తో వస్తే, బిచ్చగాడూ2 చెల్లి సెంటిమెంట్ వచ్చి బారి విజయాన్ని అందించింది. .

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తమిళ .. తెలుగు భాషల్లో తన జోరును కొనసాగిస్తోంది. ఈ సినిమా లాభాల బాట పట్టినట్టేనని అని సమాచారం . ఈ నేపథ్యంలోనే ‘బిచ్చగాడు 3’ సినిమాను కూడా రూపొందించాలి ఆలోచనలో విజయ్ ఆంటోని ఉన్నాడని తెలుస్తుంది . ఎందుకంటే ‘బిచ్చగాడు’ తరువాత మళ్లీ ఆయనకి హిట్ ఇచ్చిన సినిమా ఇదే కాబట్టి.

బిచ్చగాడు 3... పై దృష్టి పెట్టిన విజయ్ ఆంటోని! త్వరలోనే ప్రేక్షకుల ముందుకి
బిచ్చగాడు 3

ఇక ఏ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో తన చిన్నతనం నుంచి బిచ్చమ్ ఎత్తుకుంటూ ఉంటాడు . అలాంటి అతనికి లక్షకోట్ల ఆస్తులను అనుభవించే అవకాశం లభిస్తుంది . కానీ అతను బిచ్చగాడిలా ఉండటానికి ఇష్టపడతాడు. లక్ష కోట్లను ఆస్తిని అలా వదిలేస్తే ఆ సొమ్ము స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లిపోతుందని తెలుసుకుని , పేదవాళ్లందరిని ఉద్ధరించడానికిసిద్దమవుతాడు. . ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా ప్రేక్షకులకి కి బాగా కనెక్ట్ అయింది.