Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : విజయ్ ఆంటోని, అంజలి, సునైనా, యోగి బాబు, జయప్రకాష్
సంగీతం : విజయ్ ఆంటోని
దర్శకత్వం : కృతిగ ఉదయనిధి
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోని
సలీం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విజయ్ ఆంటోని, బిచ్చగాడు సినిమాతో తెలుగు వారి గుండెల్లో పాగా వేశాడు. బిచ్చ్హగాడు సినిమాతో తెలుగులోనూ మార్కెట్ పెంచుకున్న విజయ్, తరువాత తను హీరోగా నటించిన ప్రతీ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. కానీ బిచ్చగాడు స్థాయిలో విజయం మాత్రం సాధించలేకపోయాడు. అందుకే మరోసారి మదర్ సెంటిమెంట్‌ను నమ్ముకొని కాశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా అయినా విజయ్ ఆంటోనికి టాలీవుడ్‌లో మరో విజయమా అందించిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం.
స్టోరీ లైన్ :
భరత్ (విజయ్ ఆంటోని) న్యూయార్క్‌లో వన్ ఆఫ్ ది టాప్ డాక్టర్. సొంత హాస్పిటల్, హోదా, మంచి కుటుంబం అన్నీ ఉన్నా భరత్ కు చిన్నప్పటి నుండి చిన్న బాబును ఎద్దు పొడిచినట్టుగా ఓ కల చిన్నతనం నుంచి వస్తుంటుంది. అయితే తన తల్లి కిడ్నీలు ఫెయిల్ అవ్వటంతో తన కిడ్నీ ఇచ్చి బ్రతికించుకుందాం అనుకున్న భరత్ కి ఇన్నాళ్లు తను అమ్మానాన్నలు అనుకుంటున్న వారు తనను పెంచిన తల్లిదండ్రులు మాత్రమే అని తెలుస్తుంది. దీంతో తనకు రోజు వచ్చే కలకు తన గతానికి ఏదో సంబంధం ఉందన్న నమ్మకంతో తనను కన్న తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు భరత్. అనాథశ్రమంలో తన తల్లిపేరు పార‍్వతి అని, ఆమె సొంత ఊరు కంచెర్లపాలెం అని తెలుసుకొని ఆ ఊరికి వెళతాడు. ఆ వూరు వెళ్ళిన భారత్ కి నిజం తెలుస్తుందా ? భరత్ ఈ ప్రయత్నంలో విజయం సాధించాడా..? అసలు భరత్ వారికి ఎలా దూరమయ్యాడు..? పాము వల్ల ఎద్దు పొడవడం ఎందుకు ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
ఈ సినిమా విజయ్ ఆంటోని వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. సినిమా మొత్తాన్ని అంతా తానే అయి నడిపించాడు. నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించినా ఎమోషన్స్ చూపించే సీన్స్ లేకపోవడం వల్ల నాలుగు పాత్రలు కూడా రొటీన్‌గా సాగిపోతాయి. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన యోగిబాబు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. అంజలిది దాదాపుగా అతిథి పాత్రే అయినా ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
బిచ్చగాడు సినిమాలో మదర్ సెంటిమెంట్‌తో సక్సెస్ సాధించిన విజయ్ ఆంటోని మరోసారి అదే సెంటిమెంట్‌ను నమ్మి కాశి సినిమా చేశాడు. విజయ్ ఆంటోని సినిమా అనగానే ఏదో కొత్తదనం ఉందనే ఆలోచన ప్రేక్షకులకు కలుగుతుంది. దానికి తోడు తొలి ఏడు నిమిషాల సినిమాను ముందుగానే విడుదల చేయడంతో ఆ ఏడు నిమిషాలను చూసిన వారికి సినిమా తప్పకుండా బావుంటుందనే అంతా భావించారు. ఒక వ్యక్తికి పాము కల్లోకి రావడం, ఎద్దు పొడవడానికి వచ్చినట్టు తరమడం వంటివి ఆ ఏడు నిమిషాల్లో కనిపించాయి. హీరో గతానికి వాటికీ సంబంధం ఉందనే అంశాన్ని సినిమాలో చూపించారు. ఎద్దు వరకు సరేగానీ, పాము ఎందుకు కనిపిస్తుందో లాజిక్ లేదు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమైన కొడుకు తన గతాన్ని వెతుక్కుంటూ చేసే ప్రయాణమే కాశి కథ. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ లేదు. కథను ఆసక్తికరంగా తెరకెక్కించటంలో దర్శకురాలు కృతిగ ఉదయనిధి పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అసలు కథను పక్కన పెట్టి కథతో సంబంధం లేని పిట్టకథలతో సినిమాను నడిపించారు. గత చిత్రాల్లో సూపర్ హిట్ మ్యూజిక్‌తో ఆకట్టుకున్న విజయ్ ఆంటోని ఈ సారి పాటలతోనూ మెప్పించలేకపోయాడు అక్కడక్కడా బేతాళుడు సాంగ్స్ విన్న ఫీలింగ్ కలగడం కొసమెరుపు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. `బిచ్చగాడు` తర్వాత ఆ స్థాయి హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ ఆంటోనీకి `కాశి` నిరాశనే మిగులుస్తుంది. కొత్తదనం కోరుకునేవారు ఈ సినిమా ఒక్కసారికి చూడచ్చు.
ప్లస్ పాయింట్స్ :
ఎమోషనల్ సీన్స్
విజయ్ ఆంటోని నటన
నేపథ్య సంగీతం
హీరోయిన్ నటన
కథలో కొత్తదనం
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్‌ప్లే
మ్యూజిక్
రీరికార్డింగ్
కథనం
కామెడీ