విజయ్ అంటోనీ తెలుగు తెర కు బిచ్చగాడు చిత్రం తో పరిచయం అయ్యాడు. తమిళంలో అప్పటికే రెండు చిత్రాల్లో నటించిన విజయ్ తెలుగు లో మాత్రం బిచ్చగాడు మూవీ తో వచ్చాడు. ఈ చిత్రం విడులైనప్పుడు అసలు బిచ్చగాడు టైటిలు ఏందీ అనుకున్నారు అంతా!! సూపర్ స్టార్ స్టార్ మహేష్ బాబు సినిమా బ్రహ్మోత్సవం కూడా ఆ సమయంలోనే రిలీజ్ కావడం తో బిచ్చగాడు సినిమా అనేది ఒక్కటి రిలీజ్ అయింది అనేది తెలిదు ఎవరికీ. కానీ బిచ్చగాడు సినిమా తెలుగు లో సూపర్ హిట్ట్ కావడమే కాక మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా వసూళ్లను దారుణంగా దెబ్బ కొట్టింది. ఏకంగా 25 కోట్లు షేర్ రాబట్టింది. బిచ్చగాడు చిత్రం తరువాత తెలుగు లో విజయ్ కి మంచి క్రేజీ మరియు ఫాన్స్ అండ్ మంచి సినిమా మార్కెట్ ఏర్పడింది.
ఆ తరువాత వచ్చిన సినిమా బేతాళుడు చిత్రం తెలుగు లో డిజాస్టర్ అయింది. కానీ బిచ్చగాడు సినిమా ప్రబావం కారణం గా బేతాళుడు సినిమా నుండి విజయ్ బయటపడ్డాడు. ఆ తరువాత విజయ్ నటించిన సినిమాలు నిరాశను మిగిలించ్చాయి. ఎంత వేగంగా ఎదిగినాడో అంతే వేగంగా కింద పడ్డాడు. ఈ మద్య విజయ్ నటించిన రోషగాడు చిత్రం తెలుగు లో విడుదల అయింది. కానీ ఈ చిత్రం ఒక్కటి విడుదల అయింది అని కూడా ఎవరికీ తెలవదు. రోషగాడు చిత్రం తెలుగు లో డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. తమిళంలో కూడా రోషగాడు డిజాస్టర్ అవ్వడం తో అక్కడ కూడా అతనికి ఉన్న క్రేజీ పూర్తిగా పడిపోయింది. ఫస్ట్ ఉన్న పేరును నిలుపుకునే ప్రయత్నంలో ముందు వెనక చూడకుండా సినిమా లు విడుదల చేయడంతో తెలుగు, తమిళంలో కూడా జీరో అయ్యాడు విజయ్.