యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గ్యాప్ తీసుకోకుండానే వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు. ఒకటి పూర్తి చేయడం మరో సినిమా స్టార్ట్ చెయ్యడం చేస్తున్నాడు.రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక ఈ నేపథ్యంలో విజయ్ కోసం మరో దర్శకుడు కూడా లైన్ లోకి వస్తున్నాడు. రాహుల్ సంకృత్యన్ విజయ్ కోసం ఓ స్టోరీ రెడీ చేసాడట. ఇప్పటికే ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్ కూడా ముగిసిందని సమాచారం తెలుస్తుంది.
ఆ కథ నచ్చడంతో విజయ్ కూడా నటించడానికి అంగీకరించాడని తెలిసింది. విజయ్ కి ఉన్న రొమాంటిక్ ఇమేజ్ ని బేస్ చేసుకుని రాహుల్ రాసిన స్టోరీ అని సమాచారం తెలుస్తుంది. ఈ మూవీని నిర్మించడానికి మైత్రీ మూవీ మేకర్స్ రెడీ అవుతుందట. ఇప్పటికే విజయ్-రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో ‘ట్యాక్సీవాలా’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయ్యి మంచి విజయం సాధించింది.’అర్జున్ రెడ్డి’..’గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్లు అప్పటికే విజయ్ ఖాతాలో ఉన్నప్పటికీ ‘ట్యాక్సీవాలా’ సినిమాపై తీవ్ర స్థాయిలో నెగిటివ్ ప్రచారం తెరపైకి వచ్చింది.
అదే సమయంలో విజయ్ నీ వెనుక నేను ఉన్నానంటూ నిర్మాత అల్లు అరవింద్ ముందుకొచ్చారు. రిలీజ్ తరువాత ట్యాక్సీవాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మంచి వసూళ్లని సాధించింది. ఆ తర్వాత ఇద్దరు వేర్వేరు సినిమాలు చేసారు తప్ప కలిసి మళ్ళీ పనిచేయలేదు. మళ్లీ ఇంత కాలానాకి ఆ కాంబినేషన్ మళ్ళీ కలుస్తుంది. రాహుల్ లాస్ట్ టైం నానితో శ్యామ్ సింగరాయ్ సినిమా చేశాడు. ఈ సినిమా ఒక రేంజ్ లో ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాలో నాని నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా డైరెక్టర్ గా రాహుల్ కి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఇక రాహుల్ విజయ్ కోసం ఎలాంటి కథని సిద్ధం చేస్తాడో చూడాలి.