ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే ఉన్న విజయ్ పాపులారిటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరిగిపోతుంది. విజయ్ దెబ్బకు విరాట్ కోహ్లీ లాంటి సూపర్ స్టార్స్ కూడా వెనక పడ్డారు అంటే ఆయన క్రేజ్ ఎలా పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో సినిమాతో తన మార్కెట్ భారీగా పెంచేసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ఇక ఇప్పుడు ఈయన ఇమేజ్‌కు మరో నిదర్శనం మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2018 లిస్టులో 4వ స్థానం దక్కించుకోవడమే. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలో 4వ స్థానం దక్కించుకుని అబ్బురపరిచాడు విజయ్. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు దక్కని అవకాశం విజయ్ దేవరకొండకు వచ్చింది. తెలుగులో ఇప్పుడు విజయ్ క్రేజ్ ముందు సూపర్ స్టార్స్ కూడా చేతులెత్తేస్తున్నారు. హృతిక్ రోషన్, జాన్ అబ్రహాం, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాంటి హీరోలను కూడా విజయ్ వెనక్కి నెట్టేసాడు. తెలుగులో ఈయన తర్వాత స్థానం ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. విజయ్ 4వ స్థానంతో సంచలనం సృష్టిస్తే, 14వ స్థానంలో కేజియఫ్ స్టార్ యశ్..19వ స్థానంలో రానా ఉన్నారు. మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి వాళ్ల పేర్లు ఈ లిస్టులో కనీసం కనిపించకపోవడం విశేషం.