పుల్వామా సైనికులకు విజయ్ దేవరకొండ ఆర్థిక సాయం..

Vijay Devarakonda Contributes To Soldier Welfare Fund

ట్రెండ్ ఫాలో అవ్వడం లోనే కాదు సాయం చేయడంలో కూడా తన ముందే ఉంటానంటున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈయన చేసిన పనికి అందరూ ప్రశంసిస్తున్నారు. పుల్వామాలో సైనికులు చనిపోయిన ఘటన గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటుంది, తీవ్రవాదులు చేసిన కారు బాంబు దాడిలో 42 మంది సైనికుల ప్రాణాలు కోల్పోయారు. ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు ఇప్పుడు అందరూ సంతాపం తెలియ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఒక అడుగు ముందుకేసి వాళ్లకు ఆర్థిక సాయం చేశాడు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. తాను ఇంత సాయం చేశాను అని చెప్పకుండా మీరు కూడా సాయం చేయండని కోరుతున్నాడు. వాళ్ల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది అంటూ గుర్తు చేస్తున్నాడు, అర్జున్ రెడ్డి తన వంతుగా కొంత సాయం చేసాం అని మిగిలిన వాళ్లు కూడా ముందుకు వచ్చి సాయం చేస్తే అది వాళ్లకు సాయపడుతుందని అది మన బాధ్యత తీసుకోవాలని చెబుతున్నాడు. మనమంతా కలిసి ఉన్నామని ఒక సపోర్ట్ క్రియేట్ చేద్దామని ట్వీట్ చేశాడు ఈ హీరో. విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ కు రెస్పాన్స్ కూడా బాగానే వస్తుంది మొత్తానికి సినిమాలతోనే కాదు అటు ట్రెండ్స్ విషయంలో ఇటు సాయం చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు విజయ్ దేవరకొండ.