టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు వ్యాపారాల్లోనూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ చేస్తున్న రౌడీ హీరో, అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలిసి మల్టీప్లెక్స్ సినిమా ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు.
ఏవీడీ (ఆసియన్ విజయ్ దేవరకొండ) సినిమాస్ పేరుతో ఆ మల్టీప్లెక్స్‌ను సెప్టెంబర్ 24న ప్రారంభించనున్నట్లు ఈ కుర్ర హీరో తెలిపాడు. నటుడిగా రాణించాలనే కల నుంచి సొంతంగా మల్టీప్లెక్స్ సినిమాను నిర్మించే వరకు రావడం ఆనందంగా ఉందని చెప్పాడు. కాగా, విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైగర్’ సినిమా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఛార్మి కౌర్, కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.