మరో రాజకీయ చిత్రం

Vijay Devarakonda nota movie political background movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
టాలీవుడ్‌లో రాజకీయ చిత్రాలు క్యూ కడుతున్నాయి. గత సంవత్సరంలో రానా హీరోగా తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రం తర్వాత మహేష్‌బాబు ‘భరత్‌ అను నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్‌ అను నేను’ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరో వైపు బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రతో ఒక రాజకీయ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రాలు కాకుండా తెలుగు, తమిళంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ‘నోటా’ అనే చిత్రం తెరకెక్కబోతుంది.

ప్రముఖ తమిళ దర్శకుడు జ్ఞానవేల్‌ రాజా తెలుగు మరియు తమిళంలో ఒకేసారి ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఆ సినిమాకు ‘నోటా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగు మరియు తమిళంలో ఒకే సమయంలో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆనంద్‌ శంకర్‌ ఒక విభిన్న రాజకీయ నేపథ్యంతో కథను సిద్దం చేశాడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.

ఇటీవల రాజకీయాలు ఎలా ఉన్నాయి, అవి ఎలా సాగుతున్నాయి, ప్రజలు రాజకీయాలు, పరిపాలన పట్ల ఎలా ఆలోచిస్తున్నారు అనే విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఏ ఒక్క అభ్యర్థి కూడా తమకు ఇష్టం లేనట్లయితే నోటా బటన్‌ను ఉపయోగిస్తారు. ఈవీఎం మిషన్‌లో ఈమద్య కాలంలో ఈ బటన్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. నోటాకు ఈ మద్య బాగా ప్రజాధరణ ఉంటుంది. అందుకే ఈ చిత్రంకు తప్పకుండా భారీ క్రేజ్‌ ఉండే అవకాశం ఉంది.