అర్జున్‌ రెడ్డి ఫారిన్‌ లవర్‌.. ఫొటోస్‌ వైరల్‌

Vijay Devarakonda pics Viral Social Media in Foreign Girl

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలు బ్యాక్‌ టు బ్యాక్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రాలతో విజయ్‌ దేవరకొండ స్థాయి అమాంతం పెరిగి పోయింది. సూపర్‌ స్టార్‌ అంటూ సోషల్‌ మీడియాలో విజయ్‌ దేవరకొండ గురించి ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో విజయ్‌ దేవరకొండ ఒక తెల్లపిల్లతో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. భారీ ఎత్తున ఈ పిక్స్‌ వైరల్‌ అవ్వడంతో విజయ్‌ దేవరకొండ సన్నిహితులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Vijay Devarakonda

విజయ్‌ దేవరకొండతో ఉన్న ఫారిన్‌ అమ్మాయి ఆయన లవర్‌ అంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా విజయ్‌ పీఆర్‌ టీం స్పందించింది. అర్జున్‌ రెడ్డి చిత్రంకు ముందు కొన్ని ఫొటో షూట్‌ల్లో విజయ్‌ పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫొటో అని, దీంతో తప్పేం లేదు అంటూ వారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విజయ్‌ దేవరకొండ గురించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆమెతో విజయ్‌కి ఎలాంటి సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం నోటా చిత్రం విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. మరో వైపు డియర్‌ క్రామేడ్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.