డెవిల్‌ను తలపిస్తున్న విజయ్! …లియో ఫస్ట్ లుక్..

డెవిల్‌ను తలపిస్తున్న విజయ్! ...లియో ఫస్ట్ లుక్..
Leo first look

తమిళ్‌లో దళపతి విజయ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీమ్ అభిమానులను ఈ పోస్టర్‌తో సర్‌ప్రైజ్ చేయడం విశేషం..ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రం నుంచి దళపతి విజయ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.. ‘మాస్టర్’ తర్వాత విజయ్, లోకేష్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో త్రిష, అర్జున్, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, మన్సూర్ ఆలీ ఖాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

ఈ పోస్టర్‌లో హీరో విజయ్‌తో పాటు పక్కనే ఓ తోడేలు కనిపిస్తుంది.ఇందులో విజయ్ లుక్ చాలా క్రూయెల్‌గా ఉంది.కోపం తో సుత్తితో విలన్ పళ్లు రాళ్లగొడుతున్నట్లుగా.. చాలా భయానకంగా ఉంది. ఆ పోస్టర్‌లో ఉన్న దృవపు ఎలుగుబంటి విజయ్ పాత్రను ప్రతిబింబించేలా ఉంది. ఈ క్రమం లోనే లోనే విజయ్ లియో కూడా ‘విక్రమ్’ మూవీలోని రొలెక్స్ తరహాలోనే భయంకరంగా ఉండబోతుంది అని అర్ధం అవుతుంది.