కూతురిపై నటుడు ఫిర్యాదు

Vijayakumar's police complaint Against His Daughter Vanitha

తమిళ, తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన నటుడు విజయ్‌ కుమార్‌ తన కూతురు వనితపై ఫిర్యాదు చేశాడు. చెన్నై పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా నిర్థారించారు. కూతురు తన ఆస్తిని స్వాదీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది అంటూ విజయ్‌ కుమార్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయం ప్రస్తుతం తమిళ మీడియా వర్గాల్లో తెగ చర్చకు దారి తీసింది. సొంత కూతురుపై పోలీసులకు విజయ్‌ కుమార్‌ ఫిర్యాదు చేయడం ఏంటీ అంటూ ఆగ్రహంతో ఉన్నారు. అయితే విజయ్‌ కుమార్‌ మాత్రం ఈ విషయంలో తాను తనకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Vijayakumar Daughter Vanitha

అసలు విషయం ఏంటీ అంటే గత కొంత కాలంగా వనితకు ఆమె తండ్రి విజయ్‌ కుమార్‌కు విబేదాలు తారా స్థాయిలో ఉన్నాయి. వీరిద్దరి మద్య రాజీ కుదిర్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేశారు. తాజాగా వనిత ఒక చిత్రంలో నటిస్తుంది. ఆ చిత్రం షూటింగ్‌ కోసం విజయ్‌ కుమార్‌కు చెందిన ఒక ఇంటిని వనిత అద్దెకు తీసుకోవడం జరిగింది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇంటిని వనిత ఖాళీ చేయడం లేదట. దాంతో ఆమెపై పోలీసులకు విజయ్‌ కుమార్‌ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ వివాదాన్ని ప్రస్తుతం చర్చల ద్వారా రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే వనిత మాత్రం ఆ ఇల్లు తనకు చెందాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తోంది.