తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి పోలీసులను విజయలక్ష్మి రెడ్డి అనే మహిళా పోలీసులని ఆశ్రయించిన సంగతి తెలిసిందే, అయితే ఆమె గురించి కొన్ని భయంకర నిజాలు వెల్లడయ్యాయి. విజయలక్ష్మి అనే మహిళ అన్నీ అసత్యాలు చెబుతోందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంధ్యారెడ్డి ఆరోపించారు. గండ్ర మీద ఆమె కేసులు, ఆమె మీద గండ్ర కేసులు ఇలా ఈ కేసుల పరంపర సాగుతున్న సమయంలో ఆమె తాజాగా మీడియాతో మాట్లాడారు, ఆమెకు మూడు పెళ్లిళ్లు అయ్యాయని, ఆ ముగ్గురినీ మోసం చేసి వదిలేసిందని చెప్పారు.
విజయలక్ష్మి తొలుత పస్రా గ్రామానికి చెందిన రాజిరెడ్డిని పెళ్లి చేసుకుని మూడు నెలల కాపురం తరువాత వదిలేసిందని, ఆపై నర్సింహారెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఐదేళ్లు అతన్ని ఇబ్బందులు పెట్టిందని, ఆమె బాధ తాళలేక నర్సింహారెడ్డి వదిలేశాడని, ఆ తరువాత ఇంకో వ్యక్తిని ఆమె పెళ్లాడిందని చెప్పారు. అప్పటికీ బుద్ధి పోనిచ్చుకోని ఆమె, అతనితో కాపురం చేయకుండా స్వచ్ఛంద సంస్థ పేరిట అతని మీద కూడా బ్లాక్ మెయిల్ కు దిగిందని ఆమె ఆరోపించారు. . మంత్రులు, ఎమ్మెల్యేలు లక్ష్యంగా ఆమె ఎన్నో కుట్రలు చేసిందని వెంకటరమణారెడ్డిపై ఆరోపణల వెనుక టీఆర్ఎస్ నేతలు గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ల ప్రమేయం ఉండొచ్చని ఆమె ఆరోపించారు.