ఏపీలోని డిస్టలరీస్ యజమానుల వివరాలు ఇవ్వ గలరా అని మేం సవాల్ విసిరాం.. కానీ ప్రభుత్వం స్పందించలేదన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి. ఇవాళ ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీ బెవరెజెస్ కార్పో రేషన్ వద్ద 100కు డిస్టలరీ కం పెనీల నమోదయ్యా యన్నా రు. కానీ 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయని, అదాన్ డిస్టలరీస్ 2019లో మొదలైందన్నారు. రూ. 1164 కోట్ల మేర మద్యం సరఫరా ఆర్డర్ అదాన్ కంపెనీకే ఉన్నాయని, అదాన్ కంపెనీ వెనుక విజయసాయి రెడ్డి ఉన్నారన్నారు పురందేశ్వరి.
అంతేకాకుండా.. ‘ఈ రెండు కంపెనీలను అదాన్ బలవంతంగా చేజిక్కించుకుంది. చింతకాయల రాజేష్, పుట్టా మహేష్ వంటి వారికి చెందిన సంస్థలను బలవంతంగా అదాన్ కంపెనీ చేజిక్కించుకుంది. ఎస్పీవై అగ్రస్ సంస్థకు రూ. 1800 కోట్ల మేర సరఫరా ఆర్డర్ ఉన్నాయి. ఈ సంస్థ వెనుక మిధున్ రెడ్డి ఉన్నారు. ప్రకాశం జిల్లాలో పెర్ల్ డిస్టలరీస్ దీన్ని సీఎం జగన్ సన్ని హితులు బలవం తం పెట్టి సబ్ లీజుకు తీసుకున్నారు. ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసే కంపెనీల జాబితా.. ఆ కంపెనీల ఓనర్ల జాబితా ఇవ్వాలంటే ఇవ్వలేదు. ఇప్పుడు మేమే ఆ వివరాలు బయట పెట్టాం . దశలవారీ మద్య నిషేధం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మద్యం తయారీదారులని, అమ్మకం దారులని ఏడేళ్ల పాటు జైలుకు పం పుతామన్నారు.
ఇప్పుడు మద్యం తయారీదారుల జాబితా విడుదల చేశాం .. వీరిని ఎప్పు డు అరెస్ట్ చేస్తారు..? లెక్కల్లోకి రాని మద్యం డబ్బుల లెక్కలేవీ..? మద్య నిషేధం అమలు చేయబోమని చెప్పి మరీ మద్యా దాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు.ఫోన్ పే.. గూగుల్ పే వంటివి మద్యం దుకాణాల్లో ఎందుకు కన్పించవు. ఏపీ ఆన్ లైన్ అనే యాప్ ద్వారా ఆన్ లైన్ చెల్లింపులు చేస్తామంటూ ప్రకటించారు కానీ.. అది పని చేయడం లేదని చెబుతున్నారు. మద్యం అవకతవకలపై విచారణ చేయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరాం . అలాగే ఏపీ ఆర్థిక స్థితిగతులపై నిర్మ లా సీతారామన్ ను ఫోరెన్సి క్ ఆడిట్ చేపట్టాలని కోరాం ’ అని పురందేశ్వరి అన్నారు.