నిన్న కారు వేగంగా నడుపుతూ రోడ్డును అంచనా వేయక సినీనటుడు హరికృష్ణ దుర్మరణం పాలయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనను కడసారి చూసేందుకు ఆదరాబాదరా వెళుతూ మరో ఎమ్మెల్యే పెను ప్రమాదం నుండి బయట పడ్డారు.పూర్తి వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు నిన్న హైదరాబాద్ లోని హరికృష్ణ నివాసానికి వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయం నుండి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. దీంతో ఆయన ఫ్లైట్ కు టైం అయిపోవడంతో వేగంగా విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వస్తుండగా..
కేసరపల్లి వద్ద ఎదురుగా వస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై నున్న నుంచి వస్తున్న హరినారాయణ రెడ్డి, సీతామహాలక్ష్మి దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో సీతామహాలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆమె భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎమ్మెల్యే కారు అతివేగంగా నడపడం కారణంగానే రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే వాహనం వేగంగా ఢీకొట్టడంతో..
రెండు వాహనాలు పల్టీలు కొట్టి డివైడర్‌పై పడ్డాయి. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదం జరిగిన తర్వాత ఎమ్మెల్యే రామారావు వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయణ్ని ఆటోలో విమానాశ్రయానికి పంపించారు. ఏసీపీ విజయ్ భాస్కర్ ప్రమాద స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఎం.కొండలరావుపై కేసు నమోదు చేసి, కారును సీజ్ చేసినట్లు విజయ్‌భాస్కర్ తెలిపారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేసి మంగళవారం కోర్టులో హాజరుపరుచనున్నారు