విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్

తాజాగా ఏపీలో నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే.దీనితో అధికార పార్టీ వైసీపీ మరియు ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ నేతల నడుమ పెద్ద ఎత్తున రచ్చ నడుస్తుంది.దీనితో ఒకరి మీద ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు.ఒక పక్క వారి పార్టీలోని నాయకులతో పాటుగా ఎవరికి ఉన్న మీడియా సంస్థలతో ఒకరిపై ఒకరు వార్తలు కూడా గట్టిగా దంచుతున్నారు.ఇలా రాజధాని అంశాన్ని ఒక రాజకీయ ప్రయోజనంగా మార్చేశారు.

ఇదిలా ఉండగా చంద్రబాబుకు వత్తాసు పలికే ఆయన అను”కుల” మీడియాను ఉద్దేశించి వైసీపీ ఎంపీ మరియు ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి ఒక సంచలన ట్వీట్ పెట్టారు.” ‘బాస్’ పదవి పోయినప్పటి నుంచి కిరసనాయిలుకు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రంగా కనిపించడం లేదు. వందల కోట్లు దోచుకుతినే అవకాశం కోల్పోవడంతో 5 కోట్ల మంది ప్రజల పైన ద్వేషం పెంచుకున్నాడు. అక్కడ ప్రభుత్వం లేదు. పరిపాలన లేదన్నట్టు చెత్త పలుకులు పలుకుతున్నాడు.” అంటూ ఎవరికో ఇవ్వాల్సిన తాయిలం గట్టిగానే ఇచ్చేసారు.మరి వీటిపై వారి మీడియాలో ఎలాంటి పలుకులు పలుకుతారో చూడాలి.