విక్రమ్‌ హీరోగా… కూతురు కోసం సినిమా మొదలు పెట్టిన కమల్‌

Vikram-Akshara Haasan film today launching

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ఒక వైపు నటుడిగా వరుసగా చిత్రాలు చేస్తూనే నిర్మాణంలో కూడా తనదైన పందా వేస్తున్నాడు. కమల్‌ సొంత బ్యానర్‌ రాజ్‌ కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌లో ఇప్పటికే పలు చిత్రాల నిర్మాణం జరిగిన విషయం తెల్సిందే. అయితే ఈసారి నిర్మాణం కాబోతున్న చిత్రం చాలా విభిన్నమైనదిగా తమిళ సినీ వర్గాల వారు చెబుతున్నారు. తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ హీరోగా కమల్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి రాజేష్‌ సెల్వ దర్శకత్వం వహించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అక్షర హాసన్‌ నటించబోతుంది.

Akshara Haasan

హీరోయిన్‌గా శృతిహాసన్‌ సక్సెస్‌ను దక్కించుకుని, స్టార్‌డంతో వరుసగా తెలుగు, తమిళం, హిందీల్లో సినిమాలు చేస్తోంది. కాని అక్షర హాసన్‌ మాత్రం ఇప్పటి వరకు మంచి కమర్షియల్‌ సక్సెస్‌లను అందుకోలేక పోయింది. ఆ కారణంగానే కమల్‌ హాసన్‌ తన చిన్న కూతురుతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. నేడు లాంచనంగా ఆ చిత్రాన్ని ప్రారంభించడం జరిగింది. విక్రమ్‌కు అక్షర హాసన్‌ కూతురు వయస్సు ఉంటుంది. అయినా కూడా కమల్‌ ఈ చిత్రంను నిర్మించడంపై కాస్త భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే విమర్శలను ఎప్పుడు పట్టించుకోని కమల్‌ ఇప్పుడు కూడా వాటిపై దృష్టి పెట్టడం లేదు. ఈ చిత్రంలో అక్షర హాసన్‌తో పాటు మరో హీరోయిన్‌గా కనిపించబోతుంది. ఈకొత్త సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు చెన్నైలోని కమల్‌ ఆఫీస్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ పూజా కుమార్‌ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Akshara-Haasan