వినయ విధేయ రామ రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్…!

Vinaya Vidheya Rama Movie Review

నటీ నటులు : రామ్ చరణ్ , కియర అద్వానీ, ప్రశాంత్ , స్నేహ , ఆర్యన్ రాజేష్ తదితరులు.
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నిర్మాణం : డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : దానయ్య
రచన -దర్శకత్వం : బోయపాటి శ్రీను

rammcharan-vinaya-vidheya-r

బోయపాటి అంటే యాక్షన్ కి ఒక బ్రాండ్, రామ్ చరణ్ అంటే మాస్ కి కేరాఫ్ అడ్రెస్ ఇలాంటి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందనగానే మెగా అభిమానుల సంబరాలకి అంతులేదు. అంతగా వారు సంబరపడిపోయారు. ఇక ఈ మధ్య కనుమరుగు అయిన జీన్స్ ప్రశాంత్ లాంటి సీనియర్స్ ని, స్నేహ, ప్రసన్న మొదలు చాలా పెద్ద క్యాస్టింగ్ తో సినిమా రిలీజ్ కి సిద్దమయ్యింది అనగనే ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్‌లతో ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేశాడు బోయపాటి. రంగస్థలం సినిమాతో చిట్టిబాబు పాత్ర ద్వారా తన నటనపై అప్పటివరకూ ఉన్న ప్రేక్షకుల్లో ఉన్న సందేహాలు, విమర్శలకు చెక్ పెట్టి సత్తా ఉన్న నటుడు అనిపించుకున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ వస్తున్నాడు అంటేనే ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఆశించిన మేర అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

ram-charan-moviesకధేంటంటే :
ఓ నలుగురు అనాధలు కలిసి బతుకుతూ ఉంటారు. వాళ్లకు ఓ రోజు పసిపిల్లడుగా ఉన్న బాబు దొరుకుతాడు. ఆ బాబుకి రామ్ కొణెదల(రామ్ చరణ్) అని పేరు పెట్టి వాళ్లంతా రామ్ ని అల్లారు ముద్దుగా పెంచుతారు. వీరంతా ఓ కుటుంబంలా, సొంత అన్నదమ్ముల్లా పెరిగి పెద్దవుతారు. రామ్ కూడా తన అన్నలపై ఈగ వాలితే ఆ ఈగను కూడా మెషీన్ గన్ తో కాల్చే రకం. ఈ క్రమంలో పెద్దన్న భువన్ కుమార్(ప్రశాంత్) ఐఎఎస్ అయ్యి ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ అవుతాడు. ఎలాంటి పరిస్దితుల్లోను చిన్న పొరపటు కూడా జరగకుండా ఎలక్షన్స్ జరిపించటంలో అతనికి మంచి పేరు ఉంటుంది. ఈ క్రమంలో అన్ని చోట్లా శత్రువులు ఏర్పడతారు. వైజాగ్ లో పందెం పరుశురామ్ (మఖేష్ రుషి) కూడా భువన్ కుమార్ వల్ల, రామ్ వల్ల చావు దెబ్బ తిని భువన్ కుమార్ ని,అతని ఫ్యామిలీని, ముఖ్యంగా రామ్ ని చంపేసేందుకు స్కెచ్ వేసి రౌండ్ చేస్తారు. ఇంకాసేపట్లో ఫ్యామిలీని వాళ్ళు లేపేస్తారనగా బీహార్ సీఎం వచ్చి వాళ్ల నుంచి రామ్ ని, ఫ్యామిలీని సేవ్ చేసి రామ్ చరణ్ ని పొగుడుతాడు. ఇదేమీ తెలియక ఆశ్చర్యంగా చూస్తున్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కు ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ ప్లాష్ బ్యాక్ ఏంటి ? అలాగే ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వాని పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

vinaya-vidheya-rama-movie
విశ్లేషణ :
బోయపాటి సినిమాలో ఫలానా ఫలానా సమపాళ్ళలో కలిపి ఉంటాయని కొందరి నమ్మకం. కానీ ఆ నమ్మకాన్ని బోయపాటి వమ్ము చేశారు. ఈ సినిమాలో కథ, కథనాల పై శ్రద్ద పెట్టని బోయపాటి కేవలం యాక్షన్ సీన్స్ పైనే దృష్టి పెట్టారని అర్దమవుతుంది. తన అన్నని చంపిన వారిపై పగ తీర్చుకునే క్రమంలో తీసిన ఆ యాక్షన్ ఎపిసోడ్స్ తీసినంత బాగా పండలేదు. కథలో హీరో మొదటిసారి విలన్ ని కలిసినప్పుడు కొట్టి కోమాలోకి పంపుతాడు. మళ్లీ రెండో సారి క్లైమాక్స్ లో ఎదుర్కొని చంపేస్తాడు. ఈ రెండు సార్లు తప్ప విలన్, హీరోకు మధ్య వేరేదేమీ జరగదు. హీరో యాక్షన్ తో విధ్వంసం సృష్టిస్తే చాలు అనుకున్నారు కానీ కథ విధ్వసం జరిగిపోతోందని చూసుకోలేదు. సినిమాలో ట్రైన్ మీద నుంచుని హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్ళటం, హీరో నరికిన తలలు గాల్లోనే గద్దలు ఎత్తుకుపోవటం లాంటి సన్నివేశాలు నవ్వులు తెప్పించాయి. ఇక పరిమితికి మించిన వయొలెన్స్, లాజిక్ లెస్ యాక్షన్, లాజిక్ లెస్ సీన్స్ తో సినిమా ఆశించిన మేరకు ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి.

VINAYA-VIDEYA-RAMA-MOVIE-RA
నటీనటుల విషయానికి వస్తే :
రామ్ చరణ్ నటన కంటే యాక్షన్ సీన్స్ కే ప్రధాన్యమిచి ఆయనలోని నటుడిని నిద్రపుచ్చారు ఈ సినిమాలో. ఏదో ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి కైరా ఉంది కానీ ఆమెకు కూడా పెద్దగ నటించడానికి స్కోప్ ఉన్న పాత్రమీ కాదు. వివేక్ ఒబెరాయ్ చరణ్ తో పోటీ పడి నటించారు. ఇక భారీ క్యాస్టింగ్ అంతా తమ తమ పరిధులలో బాగానే నటించారు. ఈ సినిమాలో ఎవరియినా అభినందించాలి అంటే అది ఫైట్స్ డిజైన్ చేసిన వారినే. ఎందుకంటే వారే ఒక ఫైట్ మరొక దానితో సంభంధం లేకుండా చూసుకున్నారు. బోయపాటి డైరక్షన్ టాలెంట్ ని కథ కదలనివ్వలేదు. దేవి శ్రీ ప్రసాద్ కూడా డిజప్పాయింట్ చేసారు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది.
తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : వినయ విదేయ రామ కంటే విధ్వంసక రూప రామ అనడం కరెక్ట్
తెలుగు బుల్లెర్ రేటింగ్ : 2.25 / 5